భారత భూభాగం నుంచి చైనాని ఎప్పుడు తరిమేస్తున్నారు: మోడీకి రాహుల్ ప్రశ్న

భారత భూభాగం నుంచి చైనాని ఎప్పుడు తరిమేస్తున్నారు: మోడీకి రాహుల్ ప్రశ్న

భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చిన చైనాను ఏ రోజు తరిమేస్తున్నారా చెప్పండి అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించబోతున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ట్వీట్ చేశారు.

ప్రధాని మోడీకి ట్వీట్‌ రాహుల్ గాంధీ వ్యంగంగా కౌంటర్‌ వేశారు. ఆ స్పీచ్‌లో చైనాను ఎప్పుడు తరిమేస్తున్నారో సమాధానం చెప్పాలంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. ‘‘డియర్ పీఎం, భారత భూభాగంలో నుంచి చైనాను ఎప్పుడు తరిమేస్తున్నారో ఆ డేట్‌ను సాయంత్రం ఆరు గంటలకు మీరు చేసే ప్రసంగంలో దేశ ప్రజలకు చెప్పండి. థ్యాంక్యూ’ అని ట్వీట్ చేశారు.

మే నెల నుంచి లఢఖ్‌లో భారత్ – చైనా సరిహ్దదుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యంగ్యంగా ఈ ట్వీట్ చేశారు. జూన్ 15న గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగి 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ.. కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తోంది. చైనా ఆర్మీ మన దేశ భూభాగాన్ని ఆక్రమించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రధాని మోడీపై ఆరోపణలు చేస్తున్నారు రాహుల్. అయితే గాల్వన్ లోయలో మన సైనికుల వీర పోరాటానికి చైనా ఆ రోజే వెనక్కి వెళ్లిందని, కొత్తగా మన భూభాగం కొంచెం కూడా ఆక్రమణకు గురికాలేదని ప్రధాని మోడీ గతంలోనే చెప్పారు.