కపిల్ దేవ్‌కి ఏమైంది..? కిడ్నాప్ చేస్తున్న వీడియో పోస్ట్ చేసిన గంభీర్

కపిల్ దేవ్‌కి ఏమైంది..? కిడ్నాప్ చేస్తున్న వీడియో పోస్ట్ చేసిన గంభీర్

భారత మాజీ దిగ్గజం, 1983 వరల్డ్ కప్ హీరో కపిల్ దేవ్‪ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్  చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ లవుతున్నాయి. కపిల్ దేవ్ ముఖానికి ఒక గుడ్డను కట్టి, చేతులను వెనుకవైపు తాళ్లతో కట్టిపడేశారు. ఇద్దరు వ్యక్తులు ఆయనను కాపలా ఉన్న ఓ పాతబడ్డ భవనంలోకి తీసుకెళ్తున్నారు.

అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన గంభీర్ వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్‌ని కిడ్నాప్ చేశారా..? అన్న ప్రశ్న సంధించాడు. "ఈ క్లిప్‌ని ఇంకా ఎవరైనా అందుకున్నారా? ఇది వాస్తవం కాదని అనుకుంటున్నా..! కపిల్ పాజీ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను..!" అని గంభీర్ తన X(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశాడు.

ఈ వీడియో ఏంటన్నది అభిమానులకు అంతుపట్టడం లేదు. కిడ్నాప్ అన్నది అవాస్తవమైనప్పటికీ.. ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందన్నది తెలియక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం ఇది ప్రమోషన్ల కోసం చిత్రీకరించబడిన ప్రకటన కావచ్చు అని చెప్తున్నారు.