హ్యూమన్స్ ఆఫ్ బాంబే స్టోరీ టెల్లింగ్ పోర్టల్ కేసు వివాదం..

హ్యూమన్స్ ఆఫ్ బాంబే  స్టోరీ టెల్లింగ్ పోర్టల్ కేసు వివాదం..

రెండు ఇండియన్ స్టోరీ టెల్లింగ్ పోర్టల్స్ వివాదం అంతర్జాతీయ స్థాయికి పాకింది. ఇండియాకు చెందిన ప్రముఖ స్టోరీ టెల్లింగ్ పోర్టల్స్ లో ఒకటి అయిన హ్యూమన్స్ ఆఫ్ బాంబే (HoB), మరో ఆన్ లైన్ స్టోరీ టెల్లింగ్ పోర్టల్  పీపుల్ ఆఫ్ ఇండియా (PoI)పై కాపీరైట్ ఉల్లంఘన దావా వేసింది. ఈ కేసుల కోర్టులో కొనసాగుతుండగానే న్యూయార్క్ కు చెందిన ప్రముఖ స్టోరీ టెల్లింగ్ పోర్టల్  వ్యవస్థాపకుడు HoB తీరు బాగోలేదంటూ వివాదాస్పద ట్వీట్ చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చింది హ్యూమన్స్ ఆఫ్ బాంబే (HoB) వ్యవస్థాపకురాలుకరిష్మా మెహతాకు. ఆమె ఇదే విషయమై ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు.  మా మేథో శక్తిని కాపాడుకునేందుకు మేం ప్రయత్నం చేస్తున్నాం.. ఇందులో మీ జోక్యం ఏంటని కొంచెం ఘాటుగానే స్పందించారు. దీంతో ఈ రెండు స్టోరీ టెల్లింగ్ పోర్టల్స్ మధ్య వివాదంలో  మూడో  పోర్టల్ కలగజేసుకోవడంతో మరింత వివాదాస్పద మైంది.. ఇప్పుడిది వైరల్ గా మారింది. 

హ్యూమన్స్ ఆఫ్ బాంబే (HoB) ఓ ప్రముఖ ఫోటో-ఆధారిత స్టోరీ టెల్లింగ్ ప్లాట్‌ఫారమ్. ఇటీవల ఆన్‌లైన్ స్టోరీ టెల్లింగ్ పోర్టల్ పీపుల్ ఆఫ్ ఇండియా (PoI)పై కాపీరైట్ ఉల్లంఘనపై కోర్టులో దావా వేసింది. హ్యూమన్స్ ఆఫ్ బాంబే లోగో, ట్యాగ్‌లైన్, ప్లాట్‌ఫారమ్‌లో ప్రధానమైన కథన ఆకృతితో సహా కంటెంట్‌ను పీపుల్ ఆఫ్ ఇండియా చట్టవిరుద్ధంగా కాపీ చేసిందని పేర్కొంది. 

సెప్టెంబర్ ప్రారంభంలో పోర్టల్ పీపుల్ ఆఫ్ ఇండియాపై కాపీరైట్ ఉల్లంఘటన కింద ఢిల్లీ హైకోర్టులో హ్యూమన్స్ ఆఫ్ బాంబే దావా వేసింది.  కాపీ రైట్ ఉల్లంఘించినందుకు నష్టపరిహారం, ఇకపై HoB కంటెంట్ ను వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరింది. విచారణ చేప్టటిన ఢిల్లీ హైకోర్టు.. సెప్టెంబర్ 18న పీపుల్ ఆఫ్ ఇండియా పోర్టల్ కు నోటీసులు జారీ చేసింది.

HoBని కరిష్మా మెహతా స్థాపించారు. ముంబైలోని వ్యక్తుల కథనాలను ఫోటోబ్లాగ్ పద్ధతిలో పంచుకునే Facebook (ఇప్పుడు META) పేజీగా ప్రారంభించబడింది. ప్లాట్‌ఫారమ్ అనతి కాలంలోనే జనాదరణ పొందింది. దాదాపు రెండు మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించింది. 

ఈ వివాదం మధ్య  న్యూయార్క్ కు చెందిన హ్యూమన్స్ ఆఫ్ న్యూయార్క్ వ్యవస్థాపకుడు బ్రాండన్ స్టాండన్  స్పందించాడు. 2010 హ్యూమన్స్ ఆఫ్ న్యూయార్క్ స్థాపించబడింది.  హ్యూమన్స్ ఆఫ్ బాంబే ప్రవర్తన పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాడుబ్రాండన్ స్టాండన్.. ‘‘ హ్యూమన్స్ ఆఫ్ బాంబే నా కథనాలను చాలా షేర్ చేసినప్పటికీ నేను మౌనంగా ఉన్నాను. దీని ద్వారా HoB బాగానే సంపాదించింది. అయినా నేను సంతృప్తిగానే ఉన్నాను. కానీ మీరు ఇలా  పీపుల్ ఆఫ్ ఇండియాపై కాపీరైట్ ఉల్లంఘనపై దావా వేయకుండా ఉండాల్సింది ట్విట్టర్ లో రాశాడు. 

స్టాండన్ విమర్శలపై HoB  స్పందిస్తూ.. సెప్టెంబర్ 23న బహిరంగ లేఖ రాసింది.  మా మేథోసంపత్తిని రక్షించుకునేందుకు మేం ప్రయత్నం చేస్తున్నాం.. కేసు నేపథ్యాన్ని అర్థం చేసుకోకుండా  ఇలా మాపై దాడి చేయడం ఆశ్చర్యానికి గురి చేసిందని ’ ట్వీట్ చేశారు కరిష్మా మెహతా.