స్టేజీపై ఫ్రీజ్ అయిన అమెరికా ప్రెసిడెంట్​

స్టేజీపై ఫ్రీజ్ అయిన అమెరికా ప్రెసిడెంట్​

న్యూయార్క్​: అమెరికా ప్రెసిడెంట్ ​జో బైడెన్​ మరోసారి వింతగా ప్రవర్తించారు. స్టేజీపై ఆయన కొన్ని క్షణాలపాటు ఫ్రీజ్ అయిపోయారు. కొద్దిసేపు ఎటూ కదలకుండా అలాగే నిల్చుండిపోయారు. ఇది గమనించిన అమెరికా మాజీ ప్రెసిడెంట్​ బరాక్​ ఒబామా వెంటనే బైడెన్​ చెయ్యిపట్టుకొని అక్కడినుంచి తీసుకెళ్లారు. ​లాస్​ ఏంజిలిస్​లో శనివారం డెమొక్రటిక్​ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫండ్​ రైజింగ్​ 

కార్యక్రమంలో  ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. ఇటీవలి ఇటలీలో జరిగిన జీ7 సమిట్​లోనూ బైడెన్​ వింతగా ప్రవర్తించారు. జీ7 గ్రూప్ సభ్యులందరూ ఫొటో దిగేందుకు ఒకచోట చేరగా.. బైడెన్​ మాత్రం వారికి దూరంగా వెళ్లారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ గమనించి, ఆయనను వెనక్కి తీసుకొచ్చారు. కాగా, ఈ ఘటనలతో అమెరికా అధ్యక్షుడిగా పోటీలో ఉన్న 81 ఏండ్ల జో బైడెన్​  ఫిటెనెస్​పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.