మూడు స్థానాల కోసం ఏడు టీంలు పోటీ

V6 Velugu Posted on May 15, 2022

ముంబై: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌ దశ ముగింపునకు చేరుకుంటున్న కొద్దీ.. ప్లే ఆఫ్స్​ రేస్‌‌‌‌ మరింత సంక్షిష్టంగా మారింది. కేవలం గుజరాత్‌‌‌‌ టైటాన్స్‌‌‌‌ మాత్రమే ఇప్పటికి ప్లే ఆఫ్స్​ బెర్త్‌‌‌‌ దక్కించుకోగా, ముంబై ఇండియన్స్‌‌‌‌, చెన్నై సూపర్‌‌‌‌కింగ్స్‌‌‌‌ రేస్‌‌‌‌ నుంచి నిష్క్రమించాయి. దీంతో మిగతా ఏడు టీమ్స్‌‌‌‌.. మిగతా మూడు స్థానాల కోసం తీవ్రంగా పోటీపడుతున్నాయి. ప్రస్తుతం ప్లే ఆఫ్స్​ రేస్‌‌‌‌లో ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 

  • గుజరాత్‌‌‌‌ 12 మ్యాచ్‌‌‌‌ల్లో 9 విజయాలతో 18 పాయింట్లు సాధించి టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌తో ప్లే ఆఫ్స్​లోకి అడుగుపెట్టింది. మిగతా రెండు మ్యాచ్‌‌‌‌ల్లో ఓడినా 18 పాయింట్లతో రేస్‌‌‌‌లో సేఫ్‌‌‌‌గానే ఉంటుంది. రెండు గెలిస్తే 22 పాయింట్లతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ను సుస్థిరం చేసుకుంటుంది. ఒకటి గెలిచి మరోటి ఓడినా 20 పాయింట్లతో ఉంటుంది. 
  • లక్నో 16 పాయింట్లతో రెండో ప్లేస్‌‌‌‌లో ఉంది. మిగతా రెండు మ్యాచ్‌‌‌‌ల్లో గెలిస్తే 20 పాయింట్లతో సెకండ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో ఉంటుంది. ఒకవేళ ఒక్కటి గెలిచినా 18 పాయింట్లతో నిలుస్తుంది. మిగతా రెండూ ఓడితే 16 పాయింట్లతో ఉంటుంది. అయినా మూడు లేదా నాలుగో ప్లేస్‌‌‌‌తో  ప్లేఆఫ్స్ కు వెళుతుంది.
  • ఏడు విక్టరీలతో 14 పాయింట్లతో రాజస్తాన్‌‌‌‌ మూడో ప్లేస్‌‌‌‌లో ఉంది. మిగతా జట్లతో పోలిస్తే రన్‌‌‌‌రేట్‌‌‌‌లో మెరుగ్గా ఉన్న ఈ టీమ్‌‌‌‌కే ప్లేఆఫ్స్  అవకాశాలు ఎక్కువ. మిగిలిన రెండు మ్యాచ్‌‌‌‌ల్లో విజయం సాధిస్తే 18 పాయింట్లతో నిలుస్తుంది. ఒకవేళ ఒకటి ఓడినా 16 పాయింట్లు  ఉంటాయి. రెండూ ఓడితే మాత్రం ఆరో ప్లేస్‌‌‌‌కు పడిపోయే అవకాశం ఉంది.
  • పంజాబ్‌‌‌‌ చేతిలో ఓడి బెంగళూరు ప్లే ఆఫ్స్‌‌‌‌ను క్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న ఆర్‌‌‌‌సీబీ రన్‌‌‌‌రేట్‌‌‌‌ మైనస్‌‌‌‌లో ఉండటం ఇబ్బందిగా మారింది. గుజరాత్‌‌‌‌తో జరిగే లాస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో భారీ తేడాతో గెలిస్తే తప్ప టాప్‌‌‌‌–4లో ప్లేస్‌‌‌‌ కష్టం. 
  • ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న ఢిల్లీకి ప్లే ఆఫ్స్‌‌‌‌ అవకాశాలు ఇంకా మెరుగ్గానే ఉన్నాయి. మిగిలిన రెండు మ్యాచ్‌‌‌‌ల్లో నెగ్గితే 16 పాయింట్లతో బెర్త్‌‌‌‌ దాదాపుగా దక్కుతుంది. ఎందుకంటే రన్‌‌‌‌రేట్‌‌‌‌లో ఢిల్లీ, బెంగళూరు కంటే మెరుగ్గా రాజస్తాన్‌‌‌‌ కంటే కాస్త తక్కువగా ఉంది. ఒకవేళ ఒకటి గెలిచి మరోటి ఓడితే మాత్రం ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. 
  • 12 పాయింట్లతో ఉన్న పంజాబ్‌‌‌‌ రన్‌‌‌‌రేట్‌‌‌‌ (0.02) చాలా తక్కువగా ఉంది. ఆరో ప్లేస్‌‌‌‌లో ఉన్న ఈ జట్టు మిగతా రెండింటిలో గెలిస్తే 16 పాయింట్లు వస్తాయి. మిగతా జట్ల సమీకరణాలపైనే దీని ప్లే ఆఫ్స్​ బెర్త్‌‌‌‌ ఆధారపడి ఉంటుంది. 
  • హైదరాబాద్ పై విక్టరీతో కోల్‌‌కతా 13 మ్యాచ్ ల్లో 12 పాయింట్లతో ఆరో స్థానానికి ఎగబాకింది. చివరి మ్యాచ్ లో గెలిస్తే 14 పాయింట్లకు చేరుకుంటుంది. ఇప్పటికే రాజస్తాన్‌‌, బెంగళూరు 14 పాయింట్లతో రేస్‌‌లో ఉన్నాయి. దీంతో కేకేఆర్ కూడా మిగతా జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
  • శనివారం కోల్ కతా చేతిలో చిత్తుగా ఓడిన హైదరాబాద్‌‌‌‌ 12 మ్యాచ్‌‌ల్లో 5 విజయాలు, 7 ఓటములతో 10 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసును సంక్లిష్టం చేసుకుంది. రన్ రేట్ కూడా నెగిటివ్ గా ఉండటంతో ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉన్న రైజర్స్ మిగిలిన రెండు మ్యాచ్‌‌ల్లో భారీ తేడాతో గెలిచి మిగిలిన జట్ల సమీకరణాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి.
     

Tagged chance, gujarath, IPL 2022, playoffs race, right now

Latest Videos

Subscribe Now

More News