కేసీఆర్ కుటుంబం వల్లే సింగరేని దివాలా?: కిషన్ రెడ్డి

కేసీఆర్ కుటుంబం వల్లే సింగరేని దివాలా?: కిషన్ రెడ్డి
  • అన్నీ మరిచి నాపై నిందలేస్తారా?: కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి
  • సింగరేణికి అన్యాయం చేసిందెవరో చర్చించేందుకు కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిద్ధమా?  
  • రాష్ట్ర ప్రభుత్వం  తక్షణమే రూ. 54 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి
  • ప్రధాని తల్లిపై దుర్మార్గమైన పోస్ట్ పెడతారా? అని కామెంట్​

న్యూఢిల్లీ, వెలుగు:  పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం పుణ్యమా అని సింగరేణి సంస్థ ప్రస్తుతం దివాలా తీసే ప్రమాదంలోకి వచ్చిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అవన్నీ మరిచి ఇప్పుడు కేంద్ర మంత్రిగా తాను సింగరేణికి అన్యాయం చేశానంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు సింగరేణికి అన్యాయం చేసిందెవరో చర్చకు సిద్ధమా? అని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సవాల్ విసిరారు. తాను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయ్యాకే సింగరేణికి న్యాయం జరుగుతున్నదని చెప్పారు. మంగళవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తున్నదని తెలిపారు.

ఇందులో భాగంగానే సింగరేణికి వరుసగా మూడో కోల్ బ్లాక్ దక్కిందన్నారు. మణుగూరు పీకేఓసీ 2 డిప్ సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషంగా ఉందని తెలిపారు.  అనేక కంపెనీలు వేలంలో పాల్గొనడానికి ముందుకు వచ్చినా సింగరేణి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని  బొగ్గు బ్లాక్‌‌‌‌లను కేటాయిస్తున్నట్టు చెప్పారు. ‘‘గతంలో తాడిచర్ల బ్లాక్ కూడా సింగరేణికి దక్కింది. తాజాగా కోల్ బ్లాక్ కేటాయింపుతో సింగరేణికి కొత్త ఆశలు చిగురించాయి. ఈ సంస్థను గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ దోచుకునేందుకు ప్రయత్నించాయి. కేసీఆర్, రేవంత్ రెడ్డి పుణ్యమా అని సింగరేణి కార్మికులకు సంబంధించిన రూ.54 వేల కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. ఆ బకాయిలు వెంటనే ఇవ్వాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా.  బకాయిలు ఇచ్చేలా రాష్ట్ర బీజేపీ తరఫున ఒత్తిడి చేస్తాం’’ అని చెప్పారు. సింగరేణికి బకాయిలు చెల్లించేవరకు కార్మిక సంఘాలు పోరాడాలన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా ఆ నిధులను వసూలు చేస్తామని తెలిపారు. 
రెండేండ్లలో 44 సార్లు 

అధికారులను మారుస్తారా?

రాష్ట్రంలో అధికారుల బదిలీలు ‘మ్యూజికల్ చైర్’ ఆటలా మారిందని  కిషన్‌‌‌‌రెడ్డి విమర్శించారు. గడిచిన రెండేండ్లలో 44 సార్లు అధికారులను మార్చడం వల్ల వారిలో ఆందోళన నెలకొందన్నారు. ఎలాంటి తప్పు చేయకపోయినా అధికారులను బదిలీ చేస్తూ, బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ, ఆయన తల్లిపై సోషల్​ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై బీజేపీ నేత సాయికిరణ్ ఫిర్యాదు చేయగా, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. అయితే, ఈ కేసులో మెటా ఇండియా హెడ్‌‌‌‌కు నోటీసులు ఇచ్చారన్న కారణంతో కేసు నమోదు చేసిన డీసీపీ అరవింద్ బాబును రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసి వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే ఈ బదిలీ జరిగిందని అన్నారు. గతంలో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికారాన్ని దుర్వినియోగం చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోందని ఫైర్ అయ్యారు. 2020లో 5,024గా ఉన్న సైబర్ క్రైమ్ కేసుల సంఖ్య.. 2024 నాటికి 27,230కి (440% పెరుగుదల) చేరాయని, ఇన్ని కేసులు నమోదు అవుతుంటే ప్రధానిపై వచ్చిన ఫిర్యాదుపై కేసు పెడితే రేవంత్ రెడ్డికి కళ్లమంట ఎందుకని ప్రశ్నించారు.

రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కారు

ఏ సోషల్ మీడియా సంస్థ అయినా, మల్టీ నేషనల్ కంపెనీ అయినా భారత రాజ్యాంగానికి అతీతం కాదని కిషన్‌‌‌‌రెడ్డి స్పష్టం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఎంతటి సంస్థపై అయినా చర్యలు తప్పవని అన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు ఉపయోగిస్తున్న భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్న ఆయన, రాజకీయాల్లో హూందాతనం కొరవడిందని విచారం వ్యక్తం చేశారు.  పార్టీ జాతీయ అధ్యక్షులు రాజీనామా చేసిన నియోజక వర్గంలో పార్టీ ఓటమిపై స్పందిస్తూ..  ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమే అని అన్నారు. ఒక ఎన్నికల్లో ఏదైనా ఒక పార్టీ గెలుపు ఓటములకు.. స్థానికంగా ఉన్న సమస్యలు, అభ్యర్థిలాంటి  ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తాయని చెప్పారు.