తెలంగాణ సీఎంను.. హైకమాండ్ డిసైడ్ చేస్తుంది : డీకే

తెలంగాణ సీఎంను.. హైకమాండ్ డిసైడ్ చేస్తుంది : డీకే

కాంగ్రెస్ ఎల్పీ మీటింగ్ ముగిసింది. గెలిచిన ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించిన ఏఐసీసీ పరిశీలకులు.. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. సీఎం ఎవరు.. డిప్యూటీ సీఎం ఎవరు అనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని.. సీఎల్పీ అభిప్రాయాలను హైకమాండ్ కు పంపించినట్లు వెల్లడించారు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. 

తెలంగాణ సీఎం ఎవరు అనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని.. ఎమ్మెల్యేలు అందరితో.. విడివిడిగా మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకున్నట్లు వెల్లడించారు డీకే శివకుమార్. అందరితో చర్చించిన తర్వాత.. సీఎం ఎవరు అనే పేర్లను.. హైకమాండ్ కు సీల్డ్ కవర్ లో పంపినట్లు తెలిపారు. ఫైనల్ డెసిషన్ ఇవాళే.. అంటే డిసెంబర్ 4వ తేదీనే వెల్లడిస్తామని.. ఇవాళే ప్రమాణ స్వీకారం ఉంటుందని మాత్రం స్పష్టం చేశారు డీకే శివకుమార్.

.