రోడ్డు పక్కన ఉండే మైలురాళ్లు వేర్వేరు రంగుల్లో ఎందుకు ఉంటాయో తెలుసా ? 90% మందికి తెలియదు..

రోడ్డు పక్కన ఉండే మైలురాళ్లు వేర్వేరు రంగుల్లో ఎందుకు ఉంటాయో తెలుసా ? 90% మందికి తెలియదు..

రోడ్డుపై ప్రయాణించేటప్పుడు రోడ్డు పక్కన పసుపు, ఆకుపచ్చ, నలుపు లేదా నారింజ రంగులు ఉన్న  మైలురాళ్లను సాధారణంగా మనం చూస్తుంటాం. చాలా మంది ఇవి కేవలం గమ్యస్థానానికి ఉన్న దూరాన్ని  చెప్పడానికి మాత్రమే అనుకుంటారు. కానీ, ఎలాంటి సైన్  బోర్డులు చూడకుండానే, కేవలం ఆ మైలురాయి రంగును బట్టి మనం జాతీయ రహదారిపై ఉన్నామా, రాష్ట్ర రహదారిపై ఉన్నామా లేదా గ్రామ రోడ్డు పై ఉన్నామా అని  ఈజీగా కనిపెట్టొచ్చు. అసలు ఆ రంగుల అర్థం ఏంటో తెలుసా....

1. పసుపు రంగు మైలురాయి 
మైలురాయి పైభాగం పసుపు రంగులో ఉంటే, మీరు నేషనల్ హైవే/జాతీయ రహదారి లేదా ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్నారని అర్థం. ఈ రోడ్లు దేశంలోని పెద్ద పెద్ద నగరాలను, రాష్ట్రాలను కలుపుతాయి. వీటిని కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే NHAI వారు నిర్మించి, చూసుకుంటారు.

2. ఆకుపచ్చ రంగు మైలురాయి 
మైలురాయి పైభాగం ఆకుపచ్చ రంగులో కనిపిస్తే, మీరు స్టేట్ హైవే/రాష్ట్ర రహదారి పై ప్రయాణిస్తున్నారని అర్థం. ఈ రోడ్లు ఒక రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలను కలుపుతాయి. ఈ రాష్ట్ర రహదారుల బాధ్యతను పూర్తిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయి.

3. నలుపు లేదా నీలం రంగు మైలురాయి 
మైలురాయిపై నలుపు లేదా ముదురు నీలం రంగు ఉంటే, అది జిల్లా రోడ్డు అని అర్థం. అంటే మీరు ఏదైనా పెద్ద నగరం లేదా జిల్లా సెంటర్  వైపు వెళ్తున్నారు. ఈ రోడ్ల నిర్వహణను ఆ జిల్లా  కార్పొరేషన్ లేదా జిల్లా పరిషత్ చూసుకుంటుంది.

4. నారింజ రంగు మైలురాయి 
గ్రామాల్లో ప్రయాణించేటప్పుడు రోడ్డు పక్కన  ఆరెంజ్ రంగు మైలురాళ్లు కనిపిస్తాయి. ఈ రోడ్లను ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద నిర్మించారని దీని అర్థం. పల్లెటూళ్లను పెద్ద పెద్ద హైవేలతో కలపడానికి ఈ రోడ్లను వేస్తారు. ఇకపై మీరు ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు పక్కన ఉన్న రాయి రంగును బట్టే... మీరు ఏ రోడ్డులో ఉన్నారో, ఆ రోడ్డును ఎవరు వేశారో ఈజీగా  కనిపెట్టేయవచ్చు!