రొమ్ము తగ్గించే ఆపరేషన్లు: ఏటా 100 శాతం పెరుగుతున్నాయట..ఎందుకంటే

రొమ్ము తగ్గించే ఆపరేషన్లు: ఏటా 100 శాతం పెరుగుతున్నాయట..ఎందుకంటే

గడిచిన ఐదేళ్లుగా రొమ్ము తగ్గించే ఆపరేషన్లు చేయించుకుంటున్న మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతుందని డాక్టర్లు చెపుతున్నారు. గత ఐదేళ్లలో ఇండియాలో ఈ బ్రెస్ట్ రిడిక్షన్ అపరేషన్లు 100 శాతం పెరిగాయని వెల్లడించారు. హైపర్ బ్రెస్ట్ ట్రోఫీ వేలాది మంది భారతీయ మహిళలపై ప్రభావం చూపుతుందని.. బాడీషేమింగ్ కు గురవుతున్నారని  తేలింది. దీంతో హైపర్ బ్రెస్ట్ ఉన్న మహిళలు ఈ ఆపరేషన్లకు ఇష్టపడుతున్నారు. విదేశీ సంస్కృతి, మహిళల ఫ్రీడమ్,సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సోషల్ మీడియా ఇవన్నీ రొమ్ము తగ్గింపు ఆపరేషన్లకు కారణమని అంటున్నారు. 

రొమ్ము తగ్గింపు ఆపరేషన్ల పెరుగుదల- కారణం


విదేశీ సంస్కృతి:భారతీయులు  సాంప్రదాయబద్దంగా చీరలు, కుర్తాలు ధరిస్తారు. కాలక్రమేణా మన బట్టల శైలిల మార్పు వచ్చింది. విదేశీ సంస్కృతి మనల్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. క్రమేణా టీషర్టులు, బిగుతుగా ఉండే బట్టలకు అలవాటుపడుతున్నాం. ఇవి మహిళల్లో చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. బరువైన ఛాతి ఉన్న మహిళల్లో మెడ, భుజం నొప్పికి దారి తీస్తుందని.., రొమ్ము తగ్గించే అపరేషన్లకు ఇది ఒక కారణం అని న్యూ ఢిల్లీలోని డివైన్ ఈస్తటిక్స్ సర్జరీకి చెందిన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ అమిత్ గుప్తా చెపుతున్నారు.  మరో కారణం పాశ్చాత్య దుస్తులు ధరించాలనే కోరిక అని అంటున్నారు. ఆపరేషన్ చేయించుకున్న మహిళలు కూడా ఇదే చెపుతున్నారు. 

మహిళా స్వేచ్ఛ :గతంలో మహిళలు వారి తల్లిదండ్రులు, భర్తలపై ఆధారపడే వారు. కాబట్టి ఆపరేషన్లు చేయించుకునేందుకు సంకోచించేవారు. మహిళలు ఇప్పుడు స్వతంత్రంగా ఉన్నారు కాబట్టి బ్రెస్ట్ రిడక్షన్ ఆపరేషన్లు పెరుగుతున్నాయంటున్నారు డాక్టర్లు. 

సోషల్ మీడియా: 2024లో మనం చూసే ట్రెండ్ లను రూపొందించడంలో సోషల్ మీడియా ప్రధాన అంశం. ముఖ్యంగా భారత దేశంలోని కొన్ని ట్రెండ్ లను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సోషల్ మీడియా పెరుగుదలతో మహిళలు ఇలాంటి ఆపరేషన్లకు మొగ్గు చూపుతు న్నారని డాక్టర్లు అంటున్నారు. 

ఉదాహరణకు సోషల్ మీడియాలో ముందు, తర్వాత ఫొటోలను పోస్ట్ చేస్తుంటాం. ఇలాంటివి షేర్ చేయడం ద్వారా ఇతరులను లైకులు, కామెంట్లు, ప్రశంసలు పొందాలని చూస్తారు మహిళలు. ఈ బ్రెస్ట్ రిడక్షన్ ఆపరేషన్లు ఉన్నాయని ఎక్కువ మందికి  అవగాహన ఉంది. పదేళ్ల క్రితం ఇలాంటివి ప్రజలకు తెలియవు. దీంతోపాటు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు, వీడియోలతో పెద్ద రొమ్ములు కలిగిన మహిళలకు ఇబ్బందులు తప్పట్లేవు. ఎందుకంటే వారంతా బాడీ షేమింగ్ తో అవమానించబడుతున్నారు. ఈ కారణాలతో బ్రెస్ట్ రిడక్షన్ ఆపరేషన్లకు మహిళలు మొగ్గు చూపుతున్నారని ఈ ఆపరేషన్లు నిర్వహిస్తున్న డాక్టర్లు అంటున్నారు. 

ఇటీవల సల్మాన్ తో దుల్కర్ మలయాళ సినిమాలో నటించిన నటి, బిగ్ బాస్ 17 కంటెస్టెంట్ అయోషా ఖాన్ కూడా ఇలాంటి బాడీ షేమింగ్ సమస్యను ఎదుర్కొంది. తన తండ్రి కంటే ఎక్కువ వయసున్న వ్యక్తి తన రొమ్ములపై కామెంట్ చేయడం బాధ కలిగించిందని అన్నారు అయోషా ఖాన్. 

బ్రెస్ట్ రిడక్షన్ అపరేషన్లు నిర్వహించే ప్రముఖ డాక్టర్ గోయెల్ చెప్పిన దాని ప్రకారం..పెద్ద రొమ్ములు, పెద్ద పిరుదులు, చిన్న నడుము వంటి శరీరాకృతి వల్ల సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ కు దారి తీస్తుందని మహిళలు బాధపడుతున్నారు. 

బ్రెస్ట్ రిడక్షన్ ఆపరేషన్ - దుష్ప్రభావం 

అయితే బ్రెస్ట్ రిడిక్షన్ ఆపరేషన్ల వల్ల దుష్ప్రభావాలు చాలా తక్కువ అని డాక్టర్లు అంటున్నారు. ఆపరేషన్ చేసినపుడు మచ్చలు వస్తాయని వాటిని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామంటున్నారు. మచ్చలు కాలక్రమేణా మసకబారి పోతాయని చెపుతున్నారు. 

ఆపరేషన్  చనుమొనలో మార్పులు: ఈ ఆపరేషన్ చేయించుకున్న మహిళల్లో చనుమొన తిమ్మిరి, నొప్పి  రావొచ్చని అంటున్నారు. ఇవి తాత్కాలికం లేదా శాశ్వతంగా కూడా ఉండొచ్చని అంటున్నారు. శస్త్ర చికిత్స తర్వాత రొమ్ములు అసమానంగా ఉండే అవకాశం కూడా ఉందట. అన్ని ఆపరేషన్ల లాగే బ్రెస్ట్ రిడక్షన్ ఆపరేషన్ తర్వాత ఇన్ ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్లు. దీనికి యాంటి బయోటికి చికిత్స తీసుకోవాలంటున్నారు. 

ఏదీ ఏమైనా మహిళలు అటు శారీరకంగా, ఇటు మానసికంగా  కొంత అనుభూతిని పొందేందుకు అవసరమైన రొమ్ము తగ్గించే ఆపరేషన్లు చేయించుకున్నారు.. క్రమం గా ఇవి ప్రతియేటా మరింత పెరిగే అవకాశం ఉందన్నారు నిపుణులు.