పాక్ – చైనా రెండింటితో యుద్ధం చేయగలరా?: పీవోకేపై కాంగ్రెస్ ప్రశ్న

పాక్ – చైనా రెండింటితో యుద్ధం చేయగలరా?: పీవోకేపై కాంగ్రెస్ ప్రశ్న

సత్తా ఉంటే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)ను భారత్‌లో కలపాలంటూ కాంగ్రెస్ పార్టీ.. కేంద్రానికి సవాలు విసిరింది. ఇటీవల ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ ఓ ప్రెస్‌మీట్‌లో చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ బుధవారం నాడు లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ ఈ కామెంట్ చేశారు. పార్లమెంటు అనుమతి ఇస్తే తాము పీవోకేను భారత్‌లో కలుపుతామని ఆర్మీ చీఫ్ అన్నారని, కేంద్రం ఎందుకు ఆ పని చేయడం లేదని ప్రశ్నించారాయన. పీవోకేను తిరిగి భారత్‌లో కలపాలని ఆర్మీని ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేయాలని ఆయన కోరారు.

పీవోకే విషయంలో ఎటువంటి చర్యకు దిగినా భారత ప్రభుత్వం.. చైనాతోనూ కయ్యానికి సిద్ధంగా ఉండాలని అన్నారు అధిర్ రంజన్. ‘పాకిస్థాన్, చైనా.. రెండు దేశాలను ఎదుర్కొని యుద్ధం చేసేందుకు మీరు రెడీగా ఉన్నారా? మీరు అందుకు సిద్ధంగా ఉంటే ఎందుకు పీవోకేను భారత్‌లో కలపడానికి  ముందుకు కదలడం లేదు’ అని ఆయన ప్రశ్నించారు.