MRO ఆఫీస్‌కు పెట్రోల్ డబ్బాతో వచ్చిన దంపతులు

MRO ఆఫీస్‌కు పెట్రోల్ డబ్బాతో వచ్చిన దంపతులు
  • మా స్థలం మరెవరి పేరుతోనో రికార్డుల్లో పెట్టారు
  •  పదేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోలేదంటూ ఆత్మహత్యాయత్నం

కర్నూలు: స్థలం విషయంలో తమకు అన్యాయం చేశారంటూ ఆళ్లగడ్డ తాహశీల్దార్ (MRO) ఆఫీస్ వద్ద వృద్ధ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. బత్తులూరు గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి దంపతులు పెట్రోల్, పురుగుల మందు డబ్బాలు తీసుకుని MRO ఆఫీస్‌కు వచ్చారు. పది సంవత్సరాలుగా తాహశీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరుగలేదంటూ ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడే చనిపోతామంటూ ఆత్మహత్యకు యత్నించడంతో అక్కడున్న జనం అడ్డుకున్నారు.

సుబ్బారెడ్డికి జాతీయ రహదారి పక్కనే వేరువేరు సర్వే నెంబర్లతో 11 సెంట్ల స్థలం ఉంది. ఈ రెండింటిలో ఒకటి హైవే విస్తరణలో పోయింది. స్థలానికి ప్రభుత్వం పరిహారం కూడా చెల్లించింది. ఇంకో సర్వే నెంబర్‌తో ఉన్న స్థలాన్ని మరో వ్యక్తి పన్ను చెల్లించి రెవెన్యూ రికార్డుల్లో తన పేరుతో నమోదు చేయించుకున్నాడు. స్థలం విషయంలో తమకు న్యాయం చేయాలని దంపతులిద్దరూ తాహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. తాహశీల్దార్లు మారుతున్నా తమ పని మాత్రం కావడం లేదు. దీంతో మనస్తాపం చెందిన సుబ్బారెడ్డి దంపతులు పురుగుల మందు, పెట్రోల్ డబ్బాలతో తహశీల్దార్ ఆఫీస్‌కు వచ్చారు. ఆత్మహత్య చేసుకునేందు యత్నించారు. వారిని స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు, తహశీల్దార్‌తో మాట్లాడారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇప్పించి, వారిని వెనక్కి పంపించారు.