ఆటోలో వచ్చి బ్యాంకు చోరీ చేసిన భార్యభర్తలు

V6 Velugu Posted on Sep 09, 2021

హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేశారు. ఖమ్మంకు చెందిన భార్యాభర్తలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెండు రోజుల క్రితం ఈ చోరీ జరిగింది. బ్యాంకు లాకర్లు తెరుచుకోకపోవడంతో... ఆరు కంప్యూటర్ మానిటర్లు, సీసీ ఫుటేజ్ రికార్డు అయిన డీవీఆర్‎లు ఎత్తుకెళ్లారు. తాము వెంట తెచ్చుకున్న ట్రాలీ ఆటోలో కంప్యూటర్లతో పరారైయ్యారు. అలారం వైర్లు, సీసీ కెమెరా వైర్లు కట్ చేసి చోరీకి పాల్పడ్డారు. 

Tagged Hyderabad, robbery, Gachhibowli, central bank of india, wife and husband robbery

Latest Videos

Subscribe Now

More News