హైదరాబాద్ కోకాపేట్‎లో దారుణం: భర్తను కత్తితో పొడిచి పొడిచి చంపిన భార్య

హైదరాబాద్ కోకాపేట్‎లో దారుణం: భర్తను కత్తితో పొడిచి పొడిచి చంపిన భార్య

హైదరాబాద్: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేట్‎లో దారుణం జరిగింది. భర్తపై కూరగాయల కత్తితో దాడి చేసి హత్య చేసింది భార్య. పోలీసుల వివరాల ప్రకారం.. అస్సాంకు చెందిన కృష్ణ జ్యోతి బోరా, భరత్ బోరా భార్యాభర్తలు. ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చారు. కోకాపేట్‎లో కార్మికులుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం (సెప్టెంబర్ 18) రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. 

తీవ్ర ఆగ్రహానికి గురైన కృష్ణ జ్యోతి భర్తపై కూరగాయల కత్తితో విచక్షణరహితంగా దాడి చేసింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన భరత్‎ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడటంతో చికిత్స పొందుతూ భరత్ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కృష్ణ జ్యోతిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. తాగుడికి బానిసై గత కొంతకాలంగా వేధిస్తున్నాడని.. వేధింపులు తాళలేక ఈ పని చేసినట్లు జ్యోతి పోలీసులకు వెల్లడించింది.