
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్ మెట్ మండలం మజీద్ పూర్ గ్రామంలో అడవి దున్న హల్ చల్ చేసింది. అడవిలో ఉండాల్సిన అడవి దున్న పంట పొలాల్లో ప్రత్యక్షమయ్యే సరికి రైతులు కంగారుపడ్డారు. రైతులంతా గుమిగూడే సరికి అడవి దున్న అక్కడి నుంచి పారిపోయింది. చుట్టుపక్కల అడవులు లేనిది.. అడవి దున్న ఎలా వచ్చిందని రైతులు ఆశ్యర్యపోయారు. గతంలో ఓసారి చిరుతపులి రావడం.. ఇప్పుడు అడవి దున్న రావడంతో అక్కడి రైతులు ఆందోళనకు గురవుతున్నారు.