జగిత్యాల జిల్లాలో మంటలు అంటుకొని ఈత వనాలు దగ్ధం

జగిత్యాల జిల్లాలో మంటలు అంటుకొని ఈత వనాలు దగ్ధం

కోరుట్ల/జగిత్యాల రూరల్‌‌‌‌, వెలుగు: జగిత్యాల జిల్లాలో పలు చోట్ల ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ఈత వనాలు దగ్ధమయ్యాయి. జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌పల్లి మండలం మెట్ల చిట్టాపూర్, కోరుట్ల మండలం అయిలాపూర్​, సంగెం, మోహన్‌‌‌‌రావుపేట గ్రామాల శివారుల్లో శుక్రవారం మంటలు చెలరేగి ఈత వనాలు దగ్ధమయ్యాయి. మెట్లాచిట్టాపూర్ లో దాదాపు 2 వేల చెట్లు, అయిలాపూర్ లో 400,  సంగెంలో 600, మోహన్ రావుపేటలో 500  ఈత చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. 

అలాగే బోర్‌‌‌‌వెల్, పైప్‌‌‌‌లైన్, విద్యుత్ వైర్లు కూడా మంటల్లో కాలిపోయాయని బాధితులు తెలిపారు. ఫైర్​ ఇంజన్​ వచ్చి మంటలను ఆర్పివేశారు. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామ శివారులో సుమారు 100 తాటి, 50 ఈతచెట్లు కాలిపోయాయి.

 శంకరపట్నం : శంకరపట్నం మండలం కాచాపూర్ గ్రామంలో మంటలు అంటుకొని పశుగ్రాసం, వ్యవసాయ మోటార్ల వైర్లు, స్టార్టర్ డబ్బాలు దగ్ధమయ్యాయి. కల్వల ప్రాజెక్ట్ శిఖం భూమిలో వరి సాగు చేసిన రైతులు వరి కొయ్యలకు నిప్పు పెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పలువురు భావిస్తున్నారు.