బ్యాన్ అయిన రూ.1,000 నోట్లు మళ్లీ వస్తున్నాయా

బ్యాన్ అయిన రూ.1,000 నోట్లు మళ్లీ వస్తున్నాయా

కరెన్సీ నోట్లలో  అతిపెద్ద నోటుగా ఉన్న  రూ. 2 వేల నోట్ను .. ఆర్బీఐ ఉపసంహరించుకుంది.  సెప్టెంబర్ 2023 లోపు బ్యాంకుల్లో రూ. 2 వేల నోట్లను మార్చుకోవాలని  ఆర్బీఐ సూచించింది. రూ. 2 వేల నోటు రద్దుతో కరెన్సీ నోట్లలో అతిపెద్ద నోటుగా రూ. 500 నోట్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో ఆర్బీఐ రూ. 500 నోటునే పెద్ద నోటుగా కొనసాగిస్తుందా..లేక ఇంతకంటే విలువైన పెద్దనోటును ముద్రిస్తుందా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

2016 వరకు దేశంలో అతిపెద్ద నోటుగా రూ. 1000 నోట్ ఉండేది. ఆ తర్వాత రూ. 500 నోట్ ఉన్నది. కానీ 2016 నవంబర్ 8న కేంద్ర రూ. వెయ్యి, రూ. 500 నోట్లను రద్దు చేసింది. ఆ తర్వాత రూ. 2 వేల నోటును ముద్రించింది. దీంతో పాటు..రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100. రూ. 200 , రూ. 500 నోట్లను సరికొత్త డిజైన్లతో విడుదల చేసింది. అప్పటి నుంచి పెద్ద నోటుగా రూ. 2 వేల నోటు చలామణి అయింది. ప్రస్తుతం రూ. 2 నోట్ రద్దు అయింది. 

మళ్లీ రూ. 1000 నోటు...?

ప్రస్తుతం రూ. 2 వేల నోట్ రద్దు కావడంతో..ఆర్బీఐ మరోసారి రూ. 1000 నోట్ తీసుకురానుందన్న ప్రచారం జరుగుతోంది.  గతంలో పాత నోట్లను రద్దు చేసిన తర్వాత కూడా మరోసారి వెయ్యి రూపాయల నోటును ఆర్బీఐ తీసుకువస్తుందన్న ప్రచారం జరిగింది. రూ. 2 వేల నోట్ను రద్దు చేస్తుందని..రూ. 1000 నోట్ను మళ్లీ తెస్తుందని జోరుగా వదంతులు వ్యాపించాయి. అయితే ఇప్పుడు రూ. 2 వేల నోట్ను ప్రభుత్వం రద్దు చేయడంతో  మరోసారి రూ. 1000 నోట్ ముద్రిస్తారన్న వార్తలకు బలం చేకూరింది. 

 
కరెన్సీ కొరతను అధిగమించేందుకు తీసుకొస్తుందా...?

రూ. 2వేల నోట్ రద్దుతో రూ. 1000 రూపాయల నోట్ తీసుకొస్తే బాగుటుందని అర్థిక నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  కొత్త వెయ్యి రూపాయాల నగదు మార్కెట్లోకి రావడం ద్వారా లోటు నగదును భర్తీ చేయవచ్చంటున్నారు. 2016 తర్వాత ఏడాది నుంచి కొత్త వెయ్యి రూపాయాల నగదు నోట్లు మార్కెట్లోకి వస్తాయనే ప్రచారం సాగింది.అయితే ఇంతవరకు మార్కెట్లోకి కొత్త నగదు నోట్లు మాత్రం రాలేదు. ప్రస్తుతం రూ. 2 వేల నోట్ రద్దు అయిన నేపథ్యంలో కొత్త సిరీస్ తో కొత్త వెయ్యి రూపాయాల నగదు నోట్లను ఆర్ బి ఐ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.