కేటీఆర్ ట్వీట్ చేస్తేనే పోలీసులు కేసు బుక్ చేస్తారా ? 

కేటీఆర్ ట్వీట్ చేస్తేనే పోలీసులు కేసు బుక్ చేస్తారా ? 

హైదరాబాద్: భోలక్ పుర్ కార్పొరేటర్ వ్యవహారంలో పోలీసుల తీరు పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ట్వీట్ చేస్తేనే పోలీసులు కేసు బుక్ చేస్తారా.. ? కేటీఆర్ ట్వీట్ చేయకపోతే కేసు బుక్ చేయరా..? అని ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ కేటీఆర్ చేతిలో ఉందా, హోంమంత్రి చేతిలో ఉందా..? డీజీపీ, హైదరాబాద్ సీపీ ఏం చేస్తున్నారు..? అని ఆయన నిలదీశారు. 
ఘటన జరిగి రెండురోజులు అవుతున్నా కార్పోరేటర్ పై ఎందుకు కేస్ బుక్ చేయలేదు అని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ ట్వీట్ చేసిన తరువాత నే కేసు బుక్ చేస్తారని, ఘటన జరిగిన రెండు రోజుల తరువాత కేటీఆర్ ట్వీట్ చేశారన్నారు. పోలీసులను దుర్భాషలాడిన వ్యక్తి పై వెంటనే కేసు ఎందుకు బుక్ చేయలేదు ? సామాన్య ప్రజలు ఇలా మాట్లాడితే పోలీసులు ఊరుకుంటారా ..? థర్డ్ డిగ్రీ ఉపయోగించి బొక్కలో వేస్తారు. ఎంఐఎం వాళ్లు ఏం చేసినా కేసులు పెట్టవద్దని పోలీసులకు ముందే చెప్పారు.. ఇప్పుడు కేటీఆర్ ట్వీట్ చేసిన తర్వాత కేసు బుక్ చేశారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

షాంఘైలో కరోనా కలకలం.. లాక్డౌన్ పెట్టినా తగ్గని కేసులు

పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్

ఆడపిల్ల పుట్టిందని సంబురాలు.. హెలికాప్టర్లో ఇంటికి