మేలో కరోనా లాక్ డౌన్? పెరుగుతున్న కేసులే కారణమా.. అసలు ఈ వార్త నిజమా

మేలో కరోనా లాక్ డౌన్? పెరుగుతున్న కేసులే కారణమా.. అసలు ఈ వార్త నిజమా

మేలో లాక్ డౌన్ ఉంటుందా? దేశంలో కొవిడ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తుందని ఇటీవలి కాలంలో ఓ వీడియో వైరల్‌గా మారింది. డైలీ ట్రెండింగ్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానెల్ ఈ పోస్ట్‌ను అప్‌లోడ్ చేసింది. కరోనావైరస్ కేసులు మరోసారి పెరుగుతున్నందున మే నెలలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉంటుందని వీడియోలో పేర్కొంది. ఈ విషయంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) బృందం తనిఖీ చేపట్టి.. ఎట్టకేలకకు ఈ వార్త ఫేక్ అని గుర్తించింది.

ఇటీవలి నెలల్లో కొవిడ్ (COVID) కేసుల్లో మరోసారి పెరుగుదల నమోదవుతోంది. తక్కువ మరణాల రేటు ఉన్నందున ప్రస్తుతం పరిస్థితి అయితే అదుపులోనే ఉంది. అయితే ఈ క్రమంలోనే దేశంలో మరోసారి లాక్ డౌన్ విధిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా కొంత మంది ఈ వీడియో చూసి అదే నిజమని నమ్ముతున్నారు. ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ఈ వార్త పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సహాయంతో ఆ వీడియో ఫేక్ అని తేల్చింది.

మేలో  లాక్‌డౌన్ ఉంటుందని పేర్కొంటూ వైరల్ అవుతున్న వీడియో నకిలీదని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ వీడియోను సృష్టించారని ఫ్యాక్ట్-చెక్ టీమ్ తెలిపింది. ఇలాంటి నకిలీ వార్తలను ధృవీకరించకుండా ఎటువంటి సమాచారాన్ని ప్రసారం చేయవద్దని  సూచించింది.

https://twitter.com/PIBFactCheck/status/1647876899337826304