వరల్డ్ కప్ లో రెట్టింపు జోరు చూపిస్తా : హార్దిక్

వరల్డ్ కప్ లో రెట్టింపు జోరు చూపిస్తా : హార్దిక్

టీమిండియా యంగ్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మంచి జోరు మీదున్నాడు. ప్రస్తుతం IPLలో ముంబై టీమ్ తరుపున ఆడుతున్న హార్దిక్.. ప్రతీ మ్యాచ్ లోనూ సత్తా చాటుతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో ఆల్ రౌండర్ గా అదరగొడుతున్నాడు. RCB, ఢిల్లీ మ్యాచుల్లో అద్భుతంగా ఆడి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. గురువారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కీలక వికెట్లు పొగుట్టుకున్న క్రమంలో చివర్లో వచ్చిన హార్దిక్ సిక్సర్లు, బౌండరీల మోత మోగించాడు. ముంబైకి 168 గౌరవప్రధమైన స్కోచ్ అందించాడు. ఈ మ్యాచ్ లో ఢిల్లీపై ముంబై 40 రన్స్ తేడాతో విక్టరీ సాధించింది.

మ్యాచ్ తర్వాత హర్దిక్ మాట్లాడుతూ..ఈ ఫామ్ ను ఇలాగే కొనసాగించేందుకు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిపాడు. ముంబైని ఫైనల్ కి తీసుకెళ్లాలనే తమ టీమ్ కసిగా ఉందన హర్దిక్.. వరల్డ్ కప్ లోనూ తన ఫామ్ ను రెట్టింపుగా కొనసాగిస్తానని చెప్పుకొచ్చాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో పాండ్య ఇప్పటి వరకూ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 218 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు తీసి ముంబయి ఇండియన్స్‌ టీమ్ లో టాప్ ప్లేయర్ గా మారాడు ఈ యంగ్ క్రికెటర్.