IND vs ENG 2nd T20I: భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రెండో టీ20 మ్యాచ్ ఈరోజు (జూలై 4, శనివారం) మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరగనుంది. చెస్టర్-లీ-స్ట్రీట్‌లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా మధ్యలోనే నిలిచిపోయిన సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మల అద్భుతమైన హాఫ్ సెంచరీలు వృథాగా మారాయి. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఈరోజు మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ వర్గాల్లో ఒకే ఒక్క ప్రశ్న గట్టిగా వినబడుతోంది.. ఐపీఎల్ 2026లో సంచలనాలు సృష్టించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈరోజు అంతర్జాతీయ అరంగేట్రం (Debut) చేయబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వస్తుంది.
తుది జట్టులోకి రావడం వైభవ్?:
ఐపీఎల్ 2026లో అద్భుతమైన ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీని భారత టాప్ ఆర్డర్‌లో ఆడించాలంటూ మాజీ క్రికెటర్లు, అభిమానులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. కానీ, ప్రస్తుతం పటిష్టంగా ఉన్న భారత బ్యాంటింగ్ లైనప్‌లో చోటు సంపాదించడం అంత ఈజీ కాదు. తొలి మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 24 బంతుల్లోనే 59 రన్స్ (245.83 స్ట్రైక్ రేట్) చేసి విధ్వంసం సృష్టించాడు. మరోవైపు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 47 బంతుల్లో 68 రన్స్ చేసి జట్టు ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. సంజు శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మలతో కూడిన మిడిల్ ఆర్డర్ జట్టుకు అదనపు బలాన్ని ఇస్తోంది.
ఆ సీనియర్ ప్లేయర్‌ను పక్కన పెట్టాల్సిందే:
మొదటి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఈ కోర్ గ్రూప్‌ను కాదని, వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకోవాలంటే ఒక సీనియర్ ప్లేయర్‌ను పక్కన పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి మేనేజ్‌మెంట్ ప్రస్తుతానికి వికెట్ కీపర్ బ్యాటర్ లేదా వేరే ఆటగాడిని బెంచ్‌కే పరిమితం చేసే సాహసం చేయకపోవచ్చు.. పిచ్ కండిషన్స్ బట్టి ఆఖరి నిమిషంలో ఏమైనా మార్పులు జరిగితే తప్ప, వైభవ్ తన అరంగేట్రం క్యాప్ కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పేలా లేదు.. అయినప్పటికీ వైభవ్ జట్టులోకి రావడం అనేది ఒక వైల్డ్ కార్డ్ ఆప్షన్‌గా మిగిలి ఉంది.
ALSO READ : ముంబైలో జోరుగా వాన.. వర్షంలో తడుస్తూ క్రికెట్ ఆడిన పిల్లలు..
భారత ప్లేయింగ్ XI అంచనా: సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి
