పెట్రోల్‌‌, డీజిల్‌‌పై విండ్‌‌ఫాల్ ట్యాక్స్ తగ్గించిన కేంద్ర ప్రభుత్వం

పెట్రోల్‌‌, డీజిల్‌‌పై విండ్‌‌ఫాల్ ట్యాక్స్ తగ్గించిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో ఇంధన ఎగుమతులపై విధించే 'విండ్‌‌ఫాల్ గెయిన్స్ టాక్స్'ను కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. జూన్ 1 నుంచి అమలులోకి వచ్చేలా పెట్రోల్ ఎగుమతిపై పన్నును సగానికి తగ్గిస్తూ లీటరుకు రూ.3 నుంచి  రూ.1.5 కి, లీటర్‌‌‌‌ డీజిల్‌‌పై రూ.16.5 నుంచి  రూ.13.5 కు, లీటర్  ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్‌‌)పై రూ.16 నుంచి  రూ.9.5 కు తగ్గించింది. 

అలాగే ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్‌‌లపై రోడ్డు, ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ పూర్తిగా రద్దు కానుంది. దేశీయ వినియోగం కోసం సరఫరా చేసే ఇంధన ధరలలో ఎలాంటి మార్పూ లేదు. అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌‌కు 100 డాలర్ల పైనే కొనసాగుతున్నాయి. ఈ సంక్షోభం దృష్ట్యా ఎగుమతిదారులు మితిమీరిన లాభాలు పొందకుండా అడ్డుకోవడానికి,  దేశీయంగా సప్లయ్‌‌ పెంచడానికి ప్రభుత్వం గతంలో ఈ పన్నును విధించింది. కాగా, ప్రతి 15 రోజులకొకసారి ఈ సుంకాలపై రివ్యూ జరుగుతుంది.