వైన్స్ షాపు టెండర్లకు ఒక్కరోజే 25 వేల దరఖాస్తులు

వైన్స్ షాపు  టెండర్లకు  ఒక్కరోజే 25 వేల దరఖాస్తులు

 తెలంగాణలో  వైన్స్ షాపులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. 2620 మద్యం షాపులకు అప్లికేషన్స్ స్వీకరిస్తున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు.  అక్టోబర్ 17న  శుక్రవారం ఒక్కరోజే  రికార్డ్ స్థాయిలో  25 వేల  దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం  50 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు ఎక్సైజ్ శాఖ అధికారులు.  

 18వ తేదీ శనివారం  మద్యం దరఖాస్తులు స్వీకరించడానికి చివరి రోజు కావడంతో   50 వేల దరఖాస్తులు వస్తాయని  ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. పోయినేడాది కూడా ఇదే తరహాలో చివరి రెండు రోజుల్లోనే 60 వేలకు పైగా దరఖాస్తులు రావడంతో, ఈసారి కూడా చివరి నిమిషంలో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.

దరఖాస్తుల గడువు పెంచు  తారని జరుగుతున్న ప్రచారాన్ని  నమ్మవద్దని సూచించారు ఎక్సైజ్ అధికారులు. అక్టోబర్  21, 22న డ్రా కోసం అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నట్టు చెప్పారు. 23న కలెక్టర్ల సమక్షంలో మద్యం షాపుల డ్రా యథాతథంగా కొనసాగుతుందన్నారు.