‘ప్రభాస్’కి బర్త్ డే విషెస్ చెప్పిన ‘సలార్’ టీం

‘ప్రభాస్’కి బర్త్ డే విషెస్ చెప్పిన ‘సలార్’ టీం

సాహో, రాధేశ్యామ్ చిత్రాల పరాజయాలతో..తీవ్ర నిరుత్సాహంలో ఉన్న పాన్ ఇండియా స్టార్ ‘ప్రభాస్’..ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ‘సలార్’ ఒకటి. ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ‘సలార్’ మూవీ షూటింగ్ 60 శాతం పైగానే పూర్తి అయింది. చిత్రం నుంచి ఎప్పటికప్పుడు  అప్డేట్ లను చిత్ర బృందం రిలీజ్ చేస్తోంది. ఇవాళ ప్రభాస్ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ... వర్కింగ్ స్టిల్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ప్రభాస్ స్టైలీష్ లుక్ తో  ఓ వ్యాన్ పై నిలబడి ఉన్నాడు. 

‘కేజీఎఫ్’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింసే ఈ చిత్రాన్నీ నిర్మిస్తోంది. ‘శ్రుతీ హాస‌న్’ ఈ మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. మలయాళ నటుడు ‘పృథ్వీ రాజ్’ కూడా నటిస్తున్నారు. ‘సలార్’ మూవీలో పృథ్వీరాజ్‌ `వర్ధరాజా మన్నార్‌` పాత్రలో నటిస్తున్నారు.  ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని...2023లో  సెప్టెంబర్‌ 28న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు కూడా నెగటివ్‌ రోల్ చేస్తున్నారు.