దేశంలో గురువారం ఒక్కరోజే 45 మంది కరోనాకు బలయ్యారు. దీంతో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 225కి పెరిగింది. మొత్తం కేసులు 6,711కు చేరాయి. గురువారం కొత్తగా 794 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. 1,364 కేసులు, 97 మరణాలతో లిస్టు లో మహారాష్ట్రటాప్ లో ఉంది. అక్కడ ఒక్కరోజే 228 కొత్త కేసులు నమో దయ్యాయి. 834 కేసులతో తమిళనాడు రెండో ప్లేస్ లో ఉంది. 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వైరస్ వ్యాపించింది ఇప్పటిదాకా 602 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
ప్రపంచంలో 93 వేలు దాటిన మరణాలు
ప్రపంచంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 93 వేలు దాటింది. మొత్తం 93,575 మంది వైరస్ కు బలయ్యారు. 15,77,000 మందికి కరోనా సోకింది. 3,48,188 మంది కోలుకున్నారు. 11,30,976 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మొత్తం 209 దే శాల్లో కరోనా తన ప్రభావం చూపిస్తోంది. మరణాల్లో స్పెయిన్ను దాటేసింది అమెరికా. అక్కడ 16,074 మంది వైరస్ వల్ల మరణించారు. రోజూ దగ్గ రదగ్గ ర 2 వేల మరణాలు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 20 వేల కేసులు నమోదయ్యా యి. మొత్తం4,54,615 మంది దాని బారిన పడ్డారు. బ్రిటన్లోనూ కరోనా మరణాలు వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ కరోనా మరణాల రేటు 10 శాతంపైనే ఉంది.

