నీట్ 2026 పరీక్ష రద్దు చేసినట్లు ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. పరీక్ష అయితే రద్దు అయ్యింది.. ఇంతకీ 2026 నీట్ ఎగ్జామ్ ఎంత మంది రాశారో తెలుసా.. అక్షరాల 22 లక్షల మంది స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ రాశారు.. మే 3వ తేదీ నీట్ పరీక్ష రాసిన 22 లక్షల మంది స్టూడెంట్స్.. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో నీట్ ఎగ్జామ్ రద్దు అంటూ ప్రకటన రావటంతో.. దేశ వ్యాప్తంగా 22 లక్షల మంది స్టూడెంట్స్ గందరగోళంలో పడ్డారు.. ఆందోళనకు గురవుతున్నారు. ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ ఇప్పుడు ఏం చేయాలి అనేది పెద్ద ప్రశ్నగా మారింది.
కొత్త తేదీలు ఇంకా ప్రకటించలేదు :
2026, మే 3వ తేదీన జరిగిన నీట్ ఎగ్జామ్ రద్దు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. కొత్త పరీక్ష తేదీని ఇంకా ప్రకటించలేదు. కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేసింది. అప్పటి వరకు ఓపికగా ఉండాలని స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులను కోరింది. పిల్లల భవిష్యత్ పై భయాందోళనలు వద్దని.. పరీక్ష కొనసాగించటం ద్వారా నమ్మకానికే ఎక్కువ నష్టం చేసినవాళ్లం అవుతామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వివరించింది. కొత్త పరీక్ష తేదీలో త్వరలో వెల్లడి అవుతాయని.. అప్పటి వరకు వేచి ఉండాలని వెల్లడించింది నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.
కొత్తగా మళ్లీ రిజిస్టర్ చేసుకోవాలా లేదా..?
మే 3వ తేదీన నీట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అందరూ మళ్లీ దరఖాస్తు చేసుకోవల్సిన అవసరం లేదని వెల్లడించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.
కొత్త తేదీతో వచ్చే పరీక్షకు.. గతంలో నమోదు చేసుకున్న అందరు అభ్యర్థులు అర్హత సాధిస్తారు.. మళ్లీ అప్లయ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
కొత్తగా నిర్వహించే నీట్ పరీక్షకు అదనపు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు.
కొత్తగా నిర్వహించే పరీక్షకు కొత్త హాల్ టికెట్ జారీ చేస్తారు.
