వారం రోజులుగా కారులోనే కుక్కపిల్లలు.. గ్లాస్ పగలగొట్టి రక్షించారు

వారం రోజులుగా కారులోనే కుక్కపిల్లలు.. గ్లాస్ పగలగొట్టి రక్షించారు

ఢిల్లీలో జరిగిన అమానవీయ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన పెంపుడు కుక్కలను కనికరం లేకుండా వారంరోజులుగా కారులో పెట్టి తాళం వేసింది. పాపం వాటికి తిండి, నీరు లేక బక్క చిక్కిపోయాయి. ఇంకో రెండు రోజులైన చనిపోయేవి. దీంతో స్థానికులు, మహిళా యాక్టివిస్టులు స్పందించి  కారు అద్దాలు పగలగొట్టి బయటికి తీయడంతో అవి ప్రాణాలతో ఉన్నాయి. వివరాల్లోకి వెళితే.. 

ఢిల్లీలోని చిరాంగ్ ఎంక్లేవ్ లో నివసిస్తున్న ఓ మహిళ అమానవీయంగా తన మూడు కుక్క పిల్లలను కారులో బంధించింది. ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు.. ఏకంగా వారం పైనే.. అదీ అపార్టమెంట్ వాళ్లు చూసి యానిమల్ యాక్టివిస్టులకు ఫోన్ చేయడంలో ప్రాణాలతో పడ్డాయి కానీ.. లేకపోతే ఎముకలే మిగిలేవి. 

కుక్క పిల్లలను కారు పెట్టి తాళం వేసిన విషయం తెలుసుకున్న చిరాంగ్ ఎంక్లేవ్ వాసులు యానిమల్ యాక్టివిస్టులకు ఫోన్ చేశారు. స్థానికులు, పోలీసుల సాయంతో కారు అద్దాలు పగలగొట్టి కుక్క పిల్లలను బయటికి తీసేందుకు యత్నించిన యానిమల్ మహిళా యాక్టివిస్టులపై సదరు మహిళ తిరగబడటం.. అమానవీయంగా తను చేసిన పనిని సమర్ధించుకోవడం చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను మందలించడంతో  కుక్క పిల్లలను క్షేమంగా బయటపడ్డాయి.

 సోషల్ మీడియాలో వైరల్ ఈ వీడియోను చూసిన నెటిజన్ల సదరు మహిళ అమానవీయ చర్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. దయా దాక్షిణ్యం లేకుండా మూగ జీవాలను,అమాయక ప్రాణులపై ఇలాంటి చర్యలేంటి అని మండిపడుతున్నారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.