జనగామ ఎంసీహెచ్లో శిశువును ఎత్తుకెళ్లే యత్నం..మహిళకు దేహశుద్ధి.. పోలీసులకు అప్పగింత

జనగామ ఎంసీహెచ్లో శిశువును ఎత్తుకెళ్లే యత్నం..మహిళకు దేహశుద్ధి.. పోలీసులకు అప్పగింత

జనగామ అర్బన్​, వెలుగు: జనగామ ఎంసీహెచ్​లో శిశువును ఎత్తుకెళ్లేందుకు యత్నించిన ఘటన కలకలం రేపింది. శిశువును ఎత్తుకుని పారిపోయేందుకు ప్రయత్నించిన మహిళను అక్కడున్న వారు వెంబడించి పట్టుకున్నారు. వివరాల్లోకెళ్తే.. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాక్​పూర్​ గ్రామానికి చెందిన కీర్తన, కరుణాకర్​ దంపతులకు జనగామ మాతా శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్​)లో ఈ నెల 2న మగ బిడ్డ పుట్టాడు.

బుధవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో రఘునాథపల్లి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన తాళ్లపెల్లి జ్యోతి అనే మహిళ హాస్పిటల్​కు వచ్చింది. మగ శిశువును అపహరించి బయటకు వెళ్లింది. ఆటోలో జనగామ వైపు వెళ్తుండగా శిశువు బంధువులు వెంబడించి పట్టుకున్నారు. శిశువును తీసుకుని ఆమెకు దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న జనగామ సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై భరత్​ సంఘటన స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.