డ్యూటీ నుంచి వచ్చి.. మహిళ సూసైడ్.. అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులు.. శంషాబాద్ పరిధిలో ఘటన

డ్యూటీ నుంచి వచ్చి.. మహిళ సూసైడ్.. అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులు.. శంషాబాద్ పరిధిలో ఘటన

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ పరిధిలో ఉరేసుకొని మహిళ మృతి చెందింది. బహదూర్ అలీ మక్త కాలనీకి చెందిన సాయికిరణ్, పూజ (28) దంపతులు. ఎనిమిదేండ్ల కింద ప్రేమించి పెండ్లి చేసుకున్న వీరిద్దరికి కొడుకు ధనుష్, కూమార్తె ధన్సిక ఉన్నారు. ఉస్మానియా హాస్పిటల్లో పూజ ఔట్ సోర్సింగ్​ఉద్యోగిగా, భర్త సాయి కిరణ్​ శంషాబాద్​ మున్సిపల్​లో డ్రైవర్​గా పనిచేస్తున్నారు. 

గురువారం మధ్యాహ్నం డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన పూజ బయట బాత్​రూమ్​లో ఫేస్ వాష్ చేసుకుని ఇంట్లోకి వచ్చింది. ఈ క్రమంలో కొడుకు ధనుష్ ​అమ్మ నీ వద్ద పడుకుంటానని చెప్పగా, వద్దని పక్కనే ఉన్న గదికి వెళ్లింది. అనంతరం వెళ్లి కొడుకు డోర్ కొట్టగా, ఎంతకీ తీయలేదు. దీంతో స్థానికులు తలుపులు పగలగొట్టి చూడగా, ఇంట్లోని దూలానికి ఉరేసుకొని కన్పించింది. 

అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, పూజ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. తల్లి మృతితో అనాథలుగా మారిన చిన్నారులను చూసి స్థానికులు కంటతడి పెట్టారు.