జీడిమెట్ల, వెలుగు: రీచార్జ్ చేయించలేదని మనస్తాపానికి గురైన మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిల్మ్ నగర్‌కు చెందిన కిరణ్మయి 2015 అక్టోబర్‌లో నాగల్‌కర్నూల్‌కు చెందిన సురేశ్ ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. అనంతరం ఆమె సురేశ్‌తో విడిపోయింది.
కొంతకాలంగా వెంకటేశ్ అలియాస్ చందుతో కలిసి కుత్బుల్లాపూర్‌లో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం కిరణ్మయి, వెంకటేశ్ మధ్య ఫోన్ రీచార్జ్ విషయంలో గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన కిరణ్మయి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
