అతిగా మంచినీళ్లు తాగితే.. అర గంటలో చచ్చిపోతారా..?

అతిగా మంచినీళ్లు తాగితే.. అర గంటలో చచ్చిపోతారా..?

చాలా మంది ఆరోగ్యానికి నీళ్లు మంచివని చెప్తారు. అంతే కాదు సీజన్ కు తగ్గట్టుగా నిరంతరం హైడ్రేట్ గా ఉండేందుకు వీలైనంత ఎక్కువ తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. కానీ ఓ మహిళ మాత్రం అదే నీటిని తాగి చనిపోయింది. వినడానికి చాలా వింతగా, కొత్తగా అనిపిస్తున్నా.. అమెరికాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.

అమెరికాలోని ఇండియానాలో నీరు విషమయం కావడంతో ఇద్దరు పిల్లల తల్లి ప్రాణాలు కోల్పోయింది. యాష్లే సమ్మర్స్‌గా గుర్తించబడిన ఈమె 35 ఏళ్ల వయసులో.. తక్కువ వ్యవధిలో ఎక్కువ నీరు తాగడం వల్ల చనిపోయింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, జూలై నాలుగవ వారాంతం జరుపుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, ఆమె తన ఇంటి వెనుక ద్వారం గుండా నడుస్తూ స్పృహ కోల్పోయింది. అంతకుముందు యాష్లే చాలా నీరు తీసుకుంది. అలా ఆమె అరగంట తక్కువ వ్యవధిలోనే నాలుగు బాటిళ్ల నీరు తాగింది. సాధారణంగా ఒక వ్యక్తికి రెండు లీటర్ల నీరు అవసరం. కానీ ఆమె తీసుకోవాల్సిన దాని కన్నా రెట్టింపు పరిమాణంలో తీసుకోవడంతో తీవ్రంగా ప్రభావితమైంది.

ఈ పరిస్థితిని యాష్లే సోదరుడు డియోన్ తన ఇతర సోదరులతో పంచుకున్నాడు. అనంతరం వారు వైద్యుని వద్దకు తీసుకెళ్లగా మెదడు వాపును గమనించారు. కానీ దానికి కారణమేమిటో, మళ్లీ ఆమె సాధారణ స్థితికి ఎలా తీసుకురావాలో మాత్రం నిర్ధారించలేకపోయారు. అంతకుముందు ఆమె తన ఇంట్లోకి ప్రవేశించేలోపు స్పృహ కోల్పోయింది, మళ్లీ స్పృహలోకి రాలేదు.

"వేడిగా ఉండడంతో ఆమెకు తలనొప్పి వచ్చింది. ఆమె నిజంగా దాహం వేసింది. అప్పుడు ఆమె నిర్జలీకరణానికి గురై ఉంటుందని భావించింది, అందుకే అరగంటలో నాలుగు బాటిల్ వాటర్‌ తాగింది" అని డియోన్ మిల్లర్, యాష్లే భర్త కోడి సమ్మర్స్ చెప్పారు. ఈ సంఘటనను చూసిన అతను తన భార్యకు CPR చేయడానికి ప్రయత్నించాడు. కానీ వారు ఆసుపత్రికి చేరుకోకముందే “ఆమె మెదడుకు తగినంత రక్తప్రసరణ నిలిచిపోయింది. ఆమె బ్రెయిన్ డెడ్ అయింది. అలా ఆమె ఆ రాత్రే చనిపోయింది" అన్నారాయన. దీనికి కారణం నీటి విషపూరితం అని తెలుసుకుని మొత్తం కుటుంబాం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. యాష్లే మరణం తర్వాత, ఆమె అవయవాలను వారు దానం చేయాలని నిర్ణయించుకున్నారు.

ఎంత నీరు చంపగలదు?

వాటర్ టాక్సిసిటీ లేదా వాటర్ పాయిజనింగ్ అనేది ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌లకు దారితీసే ఎక్కువ నీటిని వినియోగించిన తర్వాత ఏర్పడే పరిస్థితి. శరీరంలో పెద్ద మొత్తంలో నీరు.. రక్తంలోని సోడియం స్థాయిలను తగ్గిస్తుంది, ఇది ప్రాణాంతక సమస్యగా మారుతుంది. హెల్త్‌లైన్ ప్రకారం,  గంటల వ్యవధిలో సుమారు 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల తలనొప్పి, తిమ్మిర్లు, వికారం, మూర్ఛలు వంటి  విష లక్షణాలకు దారితీయవచ్చు.