రెండు నెలల కిందటే ప్రేమ పెండ్లి... అంతలోనే మృత్యు లోకాలకు...

రెండు నెలల కిందటే ప్రేమ పెండ్లి... అంతలోనే మృత్యు లోకాలకు...

మేడిపల్లి, వెలుగు: మేడిపల్లి పీఎస్​పరిధిలో ఓ యువతి గుండెపోటుతో కన్నుమూసింది. ఘట్​కేసర్ మండలం ముత్వెల్లిగూడకు చెందిన రాజగోని మంజుల బిడ్డ సోని(19) రెండు నెలల క్రితం పెద్ద​అంబర్​పేటకు చెందిన విజయ్​ని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ పెండ్లి ఇష్టం లేని యువతి అత్తింటి వారు దంపతులను ఇంటి నుంచి పంపించివేశారు. దీంతో ముత్వెల్లిగూడలో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. 

ప్రస్తుతం సోని గర్భవతి. కాగా, ఆదివారం ఉదయం ఆమెకు ఛాతినొప్పి వచ్చింది. దీంతో భర్త విజయ్ ఆమెను ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. బీపీ విపరీతంగా పెరగడంతో మెరుగైన వైద్యం కోసం ఓ కార్పొరేట్​ దవాఖానకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూసింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.