ఒంటిపై బట్టలు లేవు కాళ్లు, చేతులు తీసేశారు !,,తట్టిఅన్నారంలో మహిళ దారుణ హత్య  

ఒంటిపై బట్టలు లేవు కాళ్లు, చేతులు తీసేశారు !,,తట్టిఅన్నారంలో మహిళ దారుణ హత్య  
  • 29న పనికోసం వెళ్లి అదృశ్యం
  • కుక్కలు పీక్కుతుంటుండగా గుర్తింపు  
  • లైంగికదాడి చేసి  చంపేశారని అనుమానాలు 

ఎల్బీనగర్, వెలుగు: కొద్ది రోజుల కింద ఉస్మానియా యూనివర్సిటీలోని మాణికేశ్వరి నగర్​కు చెందిన ఆలకుంట మంగమ్మ కనిపించకుండా పోగా, బుధవారం నాగోల్​బండ్లగూడ సమీపంలోని 100 ఫీట్ల రోడ్డులో శవమై కనిపించింది. నిర్మానుష్య ప్రదేశంలో ఒంటిపై బట్టలు లేకుండా కుక్కలు పీక్కుతుంటుండగా పోలీసులు గుర్తించారు. ఆమెపై లైంగికదాడి చేసి తర్వాత చంపేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఓయూ మాణికేశ్వర్‌‌నగర్‌‌కు చెందిన ఆలకుంట ఈదయ్య భార్య మంగమ్మ క్యాటరింగ్‌‌ పనుల్లో డెయిలీ లేబర్​గా పని చేస్తోంది. గత నెల 29న పనికోసం ఇంటి నుంచి వెళ్లిన మంగమ్మ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌‌స్టేషన్‌‌లో ఆమె కూతురు ఈ నెల 4న ఫిర్యాదు ఇచ్చింది. దీంతో మిస్సింగ్‌‌ కేసు నమోదు చేశారు. అయితే, బుధవారం వంద ఫీట్ల రోడ్డు సమీపంలో ఓ వ్యక్తి బహిర్భూమికి వెళ్లాడు. అక్కడ బట్టలు లేకుండా పడి ఉన్న మహిళ డెడ్​బాడీని కుక్కలు పీక్కు తినడం గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 

కనిపించని కాళ్లు..చేతులు..

నాగోల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు కనిపించాయి. మృతదేహానికి కాళ్లు, చేతులు కనిపించకపోవడంతో షాక్​తిన్నారు. కుక్కలు పీక్కు తిన్నాయా? లేక నిందితులే తొలగించారా అన్నది తెలియడం లేదు.  మృతదేహం సమీపంలో కొన్ని మందు సీసాలు, బట్టలు, సెల్‌‌ఫోన్లు దొరికాయి. మంగమ్మపై లైంగికదాడి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. సుమారు నాలుగైదు రోజుల క్రితమే చంపి ఉంటారని భావిస్తున్నారు. క్లూస్‌‌ టీమ్‌‌ ఆధారాలను సేకరించింది. ఫోరెన్సిక్​రిపోర్ట్​కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు.