పురిటి నొప్పులతో 100 కిలో మీటర్లు జర్నీ : అంతలోనే ఆవిరైన ఆనందం

పురిటి నొప్పులతో 100 కిలో మీటర్లు జర్నీ : అంతలోనే ఆవిరైన ఆనందం

పురిటినొప్పులతో బాధపడుతూ 100 కిలోమీటర్లు ప్రయాణించిన మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆమె ఆనందం క్షణాల్లోనే ఆవిరైంది. డెలివరీ అనంతరం వైద్యపరీక్షలు చేసిన డాక్టర్లు మహిళకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. దీంతో ఆమెను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

జమ్మూకశ్మీర్ లోని తిల్వానీ మొహల్లా ప్రాంతానికి చెందిన షాదా, జావెద్ లు భార్య భర్తలు. డెలివరీ కోసం షాదా షేర్ గండ్ లో ఉన్న తన పుట్టింటికి వెళ్లింది.

ఈ క్రమంలో షాదా కు పురిటినొప్పులు మొదలయ్యాయి. డెలివరీ కోసం  స్థానికంగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు  చేసిన వైద్యులు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న అచబాల్ ప్రాంతంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. వైద్యుల సూచనతో అచబాల్ కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అనంత్ నాగ్ లో ఉన్న మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. అలా ఐదు ఆస్పత్రులు చుట్టూ 100 కిలోమీటర్లు ప్రయాణించి ఆరో ఆస్పత్రి లాల్ డెడ్ లో  బిడ్డకు జన్మ నిచ్చింది. డెలివరీ అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు చేయగా కరోనా వైరస్ సోకినట్లు తేలింది. అత్యవసర చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు.

రెడ్ జోన్లలో ట్రీట్ మెంట్ కు నిరాకరిస్తున్న డాక్టర్లు

రెడ్ జోన్లలో ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు డాక్టర్లు నిరాకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డెలివరీ కోసం 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం ఏముందని, నార్మల్ డెలివరీ కాబట్టి తప్పని సరిగా ట్రీట్ మెంట్ ఇవ్వాలని అన్నారు లాల్ డెడ్ ఆస్పత్రికి చెందిన వైద్యులు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీడర్స్ ప్రకారం అత్యవసర చికిత్స చేయాలని, రెడ్ జోన్ ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రికి వైద్యులు ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు తెలిపారు.

క్వారంటైన్ లోకి లాల్ డెడ్ ఆస్పత్రి వైద్యులు

షాదాకు కరోనా వైరస్ సోకడంతో లాడ్ డెడ్ ఆస్పత్రికి చెందిన 10మంది సిబ్బందితో పాటు, ఇద్దరు డాక్టర్లను క్వారంటైన్ కు తరలించినట్లు అధికారులు చెప్పారు.