సర్కస్ జంప్​లే  ఈమెను  గిన్నిస్​ రికార్డు వరకు తీసుకెళ్లాయి

సర్కస్ జంప్​లే  ఈమెను  గిన్నిస్​ రికార్డు వరకు తీసుకెళ్లాయి

హై హీల్స్​తో నడవడమే కష్టం అంటే...ఏకంగా హై హీల్స్​​తో  జంప్​లు కొట్టింది ఒక అథ్లెట్​. అది కూడా స్లాక్​ లైన్​​పై.  స్లాక్​ లైన్​ అంటే అదేదో అనుకునేరు. సర్కస్​లో నడిచే తాడు. దానిపై జంప్​లే  ఈమెని  గిన్నిస్​ వరల్డ్ రికార్డ్స్​ వరకు తీసుకెళ్లాయి. ఇంతకీ ఈ అథ్లెట్​ పేరు చెప్పలేదు కదూ.. ఓల్గా హెన్రీ.
తాడుపై గెంతులేయడాన్ని ‘బమ్​ బౌన్స్​’ అంటారు. ఈ ట్రిక్కీ స్పోర్ట్​ని మామూలుగా ఆడటమే చాలా కష్టం. అలాంటిది హై హీల్స్​తో అంటే ఓ సాహసమనే చెప్పాలి. అయినా సరే ఈ యుఎస్​ అథ్లెట్​ ముఖంలో కాస్తయినా టెన్షన్​ కనిపించలేదు.

నేలపై నడిచినంత కాన్ఫిడెంట్​గా  పోల్స్​కి కట్టేసి ఉన్న స్లాక్​లైన్స్​​పై గెంతులేసింది.  యుఎస్ కాలిఫోర్నియాలోని శాంటా మోనిక బీచ్​లో  నిమిషం పాటు ఈమె చేసిన ఆ ఫీట్​కి గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్స్​లో​ చోటు దక్కింది. ఈ విషయాన్ని గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్స్​ స్వయంగా తన ఇన్​స్ట్రాగ్రామ్​లో పోస్ట్​ చేసింది. స్లాక్​ లైన్​ మీద హై హీల్స్​తో బమ్​ బౌన్స్​ చేస్తున్న  ఓల్గా వీడియో కూడా పోస్ట్​ చేసింది గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్​. ఈ వీడియో ఇంటర్నెట్​లో​ సెన్సేషన్​ అయింది. పోస్ట్​ చేసిన గంటలోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. చాలామంది ఓల్గా టాలెంట్​కి సలాం కొడుతూ కామెంట్లు పెడుతున్నారు.