మహిళను బండరాళ్లతో కొట్టి చంపేశారు…

మహిళను బండరాళ్లతో కొట్టి చంపేశారు…

బండరాళ్లతో కొట్టి ఓ మహిళను హత్య చేశారు. ఈ ఘటన గురువారం పొద్దున కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని రంగాపూర్ లో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితులైన బొడ్డు శ్రీనివాస్ సహా అతని కుటుండంలోని 16మందిపై కేసునమోదు చేసినట్లు చెప్పారు. వారి దాడిలో సమ్మక్క అనే మహిళ మృతి చెందింది. రెండు కుటుంబాల మధ్య గొడవలే సమ్మక్క హత్యకు కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. గత కొంతకాలంగా ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెప్పారు.