కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాల్సింది.. చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసుకుంది

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాల్సింది.. చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసుకుంది

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదాన్ని ఎవరూ కూడా అంత త్వరగా మరచిపోలేరు. ఈ  రైలు ప్రమాదం చాలా మంది కుటంబాల్లో విషాదాన్ని నింపింది. చాలా మంది తమ తమ అత్మీయిలను కోల్పోయారు. అయితే ఈ రైలు ప్రమాదం నుంచి ఒక మహిళ అదృష్టవశాత్తూ తప్పించుకుంది.  

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కాల్సిన లక్ష్మీ దాస్ సర్కార్ అనే ఓ మహిళ అదృష్టవశాత్తూ  చివరి నిమిషంలో తన ప్రయాణాన్ని క్యాన్సల్ చేసుకుని తప్పించుకుంది. ప్రమాదం తర్వాత 2023 జూన్ 7 బుధవారం రోజున మొదటి రన్‌లో ఈమె కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి చెన్నైకు చేరుకుంది. 

పశ్చిమ బెంగాల్ లోని హౌరా నివాసి అయిన  లక్ష్మీ దాస్ .. తన కూతుర్ని చూసేందుకు షాలిమార్ స్టేషన్ నుండి చెన్నై వెళ్లేందుకు  కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ టికెట్ బుక్ చేసుకుంది. అయితే తన కూతురు ఆఫీస్ కమిట్‌మెంట్ కారణంగా చివరి నిమిషంలో తన ప్రయాణాన్ని రద్దు చేసుకుంది. దీంతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. 

షాలిమార్‌ నుంచి చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు ప్రయాణిస్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ జూన్ 02 శుక్రవారం రోజున పట్టాలు తప్పి పక్కనే ఉన్న గూడ్స్‌ రైలును ఢీకొంది.  కొద్దిసేపటికి ఆ రెండో ట్రాక్‌ మీదుగా హౌరాకు వెళ్తున్న బెంగళూరు- హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రాక్‌పై పడి ఉన్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ కోచ్‌లను ఢీకొంది. ఈ ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 1,100 మంది గాయపడ్డారు.