కుషాయిగూడలో డయాగ్నోస్టిక్ సెంటర్లో గోల్డ్ చైన్ మాయం..

 కుషాయిగూడలో డయాగ్నోస్టిక్ సెంటర్లో గోల్డ్ చైన్ మాయం..

 

  •     పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు

కుషాయిగూడ, వెలుగు: వైద్య పరీక్షల కోసం ఓ మహిళ డయాగ్నోస్టిక్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లగా.. ఆమె గోల్డ్​చైన్​మాయమైన ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో చోటుచేసుకుంది. దమ్మాయిగూడ లక్ష్మీనగర్ ఫేజ్-2కు చెందిన నాగ వెంకట పావని తాయారు యార్ల ప్రైవేట్​ఉద్యోగిని. గత  నెల 23న ఉదయం 9 గంటలకు ఏఎస్ రావు నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లస్ డయాగ్నోస్టిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లారు. 

చెస్ట్​స్కానింగ్​సమయంలో తన మెడలోని సుమారు 35 గ్రాముల బంగారు గొలుసును తీసి, పక్కన పెట్టారు. టెస్ట్​లు పూర్తయ్యాక ఇంటికి వెళ్లిపోయారు. కాసేపటికి గోల్డ్​చైన్​మరిచిపోయినట్లు గుర్తించిన ఆమె.. డయాగ్నోస్టిక్​సెంటర్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా.. వారు లోపల వెతికి గొలుసు లేదని చెప్పారు. దీంతో బాధితురాలు ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.