బంజారాహిల్స్ రోడ్ నంబర్‌-1లో అర్ధరాత్రి మహీంద్రా స్కార్పియో బీభత్సం

బంజారాహిల్స్ రోడ్ నంబర్‌-1లో అర్ధరాత్రి మహీంద్రా స్కార్పియో బీభత్సం

హైదరాబాద్ లో 2026 అక్టోబర్ 1 అర్ధరాత్రి మహీంద్రా స్కార్పియో బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడుతో స్థానికులను భయాందోళనకు గురిచేసింది. అతివేగంతో వచ్చిన కారు.. అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.   

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పంజాగుట్ట పోలీసులు. ప్రమాదానికి గురైన స్కార్పియో నంబర్‌ AP09 CE2415 గా గుర్తించారు. 20 ఏళ్ల యువకుడు రూప్‌ కారు నడుపుతుండగా అదుపుతప్పినట్లు గుర్తించారు. 

ప్రమాదంలో చిన్నచిన్న గాయాలతో  యువకుడు రూప్ బయటపడ్డాడు.  మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో కారులో మరెవరైనా ఉన్నారా అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఎవరికీ తీవ్ర గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.