కుషాయిగూడ: చెత్త ఆటోలో భారీ శబ్ధంతో పేలుడు..భయాందోళనకు గురైన స్థానికులు

కుషాయిగూడ: చెత్త ఆటోలో భారీ శబ్ధంతో పేలుడు..భయాందోళనకు గురైన స్థానికులు

కుషాయిగూడ, వెలుగు: కుషాయిగూడ హనుమాన్ నగర్ కాలనీలో గురువారం ఉదయం చెత్త తరలిస్తున్న ఆటోలో ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురై, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆటోలో ఉన్న పరిశ్రమల వ్యర్థాలు లేదా గుర్తు తెలియని పేలుడు పదార్థాల కారణంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఆటో స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేశామని, పేలుడుకు గల అసలు కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. అనుమతులు లేకుండా నడుస్తున్న పరిశ్రమలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.