హైదరాబాద్, వెలుగు: మహిళల సాధికారతతోనే ‘వికసిత భారత్’ సాధ్యమవుతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మహిళలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడంపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. శనివారం లోక్‌భవన్‌లో వికసిత్ వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్(వీవీవీపీ), వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ (వీబీవైపీ) విజేతలతో గవర్నర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల రాజకీయ సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వం 'నారీ శక్తి వందన్ అధినియం' పేరుతో 106వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. పార్లమెంట్, శాసనసభల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించే ఈ నిర్ణయం చరిత్రాత్మకమని తెలిపారు. అనంతరం 'మై భారత్' పోర్టల్‌లో యువత నమోదు చేసుకునేందుకు రూపొందించిన ప్రచార పోస్టర్లను గవర్నర్ ఆవిష్కరించారు.
