
హాంగ్జౌ (చైనా): ఇండియా విమెన్స్ హాకీ జట్టు.. ఆసియా కప్‌ను విజయంతో మొదలుపెట్టింది. శుక్రవారం జరిగిన పూల్–బి తొలి మ్యాచ్‌లో ఇండియా 11–0తో థాయ్‌లాండ్‌పై గెలిచింది. ఇండియా తరఫున ఉదిత (30, 50వ ని), డుంగ్ డుంగ్ (45, 54వ ని), ముంతాజ్ ఖాన్ (7వ ని), సంగీతా కుమారి (10వ ని), నవ్‌నీత్ కౌర్ (16వ ని), లాల్‌రెమిసియామి (18వ ని), తౌడమ్ సుమన్ దేవి (49వ ని), శర్మీలా దేవి (57వ ని), రుతజా (60వ ని) గోల్స్ కొట్టారు. స్టార్టింగ్ నుంచే దూకుడుగా ఆడిన ఇండియా ప్లేయర్లు తొమ్మిది పెనాల్టీ కార్నర్లను సాధించారు.
ఇందులో ఐదింటిని గోల్స్‌గా మలిచారు. థాయ్‌లాండ్ ఒక్క పెనాల్టీని కూడా సాధించలేదు. తొలి క్వార్టర్‌లో ముంతాజ్, సంగీతా రెండు ఫీల్డ్ గోల్స్ కొట్టగా, రెండో క్వార్టర్‌లో అటాకింగ్‌ను పెంచి మరో మూడు గోల్స్ సాధించారు. ఫార్వర్డ్ నవ్‌నీత్, మిడ్ ఫీల్డర్ లాల్‌రెమిసియామి చెరో ఫీల్డ్ గోల్ చేయగా, ఉదిత పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచింది. ఫలితంగా 5–0తో ఫస్ట్ హాఫ్‌ను ముగించారు. రెండో హాఫ్‌లోనూ ఇండియా నిలకడగా థాయ్‌లాండ్ సర్కిల్‌లోకి చొచ్చుకుపోయింది. దాంతో నాలుగు పెనాల్టీ కార్నర్లు లభించాయి. ఇందులో ఒక్కటి మాత్రమే గోల్‌గా మారింది. నాలుగో క్వార్టర్‌లో మరింత వ్యూహాత్మకంగా ఆడిన ఇండియా ఐదు గోల్స్‌తో రెచ్చిపోయింది. ముంతాజ్, ఉదిత, శర్మీల పెనాల్టీలను గోల్స్‌గా మలిస్తే డుంగ్ డుంగ్, రుతజా ఫీల్డ్ గోల్స్‌ను సాధించారు. శనివారం జరిగే మ్యాచ్‌లో ఇండియా.. జపాన్‌తో తలపడుతుంది.