
హాంగ్జౌ (చైనా): విమెన్స్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో ఇండియా అద్భుత ఆటను కొనసాగిస్తూ సూపర్-4కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన పూల్ మ్యాచ్‌లో ఇండియా 12-–0తో సింగపూర్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో గ్రూప్‌లో టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది. ఆట మొదలైన రెండో నిమిషంలోనే గోల్ చేసిన ముంతాజ్ ఖాన్.. 32వ, 39వ నిమిషాల్లో మరో రెండు గోల్స్ కొట్టి హ్యాట్రిక్ సాధించింది. నవనీత్ కౌర్ (14వ, 20వ, 28వ ని) కూడా హ్యాట్రిక్‌తో ఆకట్టుకోగా.. నేహా (11వ, 38వ ని) రెండు గోల్స్ చేసింది.