- రోడ్డుపై వెళ్లే ప్రయాణికులను బూతులు తిడుతూ.. పోలీసులతోనూ
- వాగ్వాదం జీడిమెట్ల పీఎస్‌లో కేసు నమోదు
జీడిమెట్ల, వెలుగు: మద్యం మత్తులో హల్ చల్ చేస్తూ ప్రయాణికులను ఇబ్బందిపెట్టిన యువతిపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సూరారం ప్రాంతానికి చెందిన రూప అలియాస్ ఇందు (24) సోమవారం అర్ధరాత్రి షాపూర్‌నగర్ చౌరస్తాలో మద్యం తాగి హల్చల్ చేసింది. రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులకు ఆటంకం కలిగిస్తూ దుర్భాషలాడింది. దీంతో స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతోనూ సదరు యువతి వాగ్వాదానికి దిగింది. అనంతం ఆమెకు నచ్చచెప్పిన పోలీసులు 108లో ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
