రామడుగు మండలంలో వర్షాలు కురవాలని బతుకమ్మ ఆడిన మహిళలు

రామడుగు మండలంలో వర్షాలు కురవాలని బతుకమ్మ ఆడిన మహిళలు

రామడుగు, వెలుగు: వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపించి పంటలు కాపాడాలని కోరుతూ రామడుగు మండలం వెలిచాలకు చెందిన మహిళలు శనివారం రాత్రి బతుకమ్మ ఆడారు. వానాకాలం మొదలై నెలరోజులు గడుస్తున్నా వర్షాలు పడకపోవడంతో నల్లరేగళ్లు, దుబ్బలలో విత్తనాలు నాటిన రైతులు వర్షం కోసం ఆకాశంవైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. వరుణుడు కరుణించి వర్షాలు కురువాలని కోరుతూ వాన దేవుడిపై బతుకమ్మ పాట పాడుతూ ఆడారు. వానదేవుడు కరుణించి ఇప్పటికైనా వర్షాలు కురిస్తే తాము వేసిన విత్తనాలు మొలకెత్తుతాయన్న ఆశతో మహిళలు బతుకమ్మ 
ఆడినట్లు పేర్కొన్నారు.