సికింద్రాబాద్ లో వైన్ షాప్ పెట్టొద్దని మహిళల ఆందోళన

సికింద్రాబాద్ లో  వైన్ షాప్ పెట్టొద్దని మహిళల ఆందోళన

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్​ పార్సీగుట్టకు వెళ్లే దారిలోని బాపూజీ నగర్ క్రాస్‌‌‌‌ రోడ్ కొత్త వైన్ షాపు ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానిక మహిళలు ఆదివారం ధర్నా నిర్వహించారు. వీరికి కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ మద్దతు తెలిపారు. 

ఈ సందర్భంగా కార్పొరేటర్​ మాట్లాడుతూ.. పిల్లలు, మహిళలు తరచూ రాకపోకలు చేసే ఈ ప్రాంతంలో వైన్​షాపునకు అనుమతించవద్దని విజ్ఞప్తి చేశారు. అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.