మహిళా ఓటర్లే అధికం..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని పురపాలికల్లో ఇదే తీరు

మహిళా ఓటర్లే అధికం..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని పురపాలికల్లో ఇదే తీరు
  • అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేయనున్న మహిళలు 
  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పురుషుల కంటే మహిళలు 16,764 ఓట్లు ఎక్కువ

రాజన్నసిరిసిల్ల, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కీలకంగా మారిన మహిళా ఓటర్లు.. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనున్నారు. 

ఉమ్మడి జిల్లాలో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రామగుండం కార్పొరేషన్లతోపాటు 13 మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. దీంతో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఇప్పటినుంచే వివిధ పార్టీల లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. 

పురుషుల కంటే 16,764 మహిళ ఓట్లు అధికం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మహిళల ఓట్లు పురుషుల కంటే 16,764 ఓట్లు అధికంగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో పురుషుల ఓట్లు 5,10,524 ఉంటే మహిళల ఓట్లు 5,27,288 ఉన్నాయి.  రెండు మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్, జగిత్యాల, కోరుట్ల, మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, రాయికల్​, ధర్మపురి, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 

మహిళా ఓట్లపై ఆశావహుల గురి

మహిళల ఓట్లు ఎక్కువగా ఉండడంతో మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నేతలు ఆ ఓట్లపై గురి పెట్టారు. కౌన్సిలర్, కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు మహిళా ఓట్లను ఎలా ఆకర్షించాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. వార్డుల్లో మహిళా సంఘాల మద్దతును కూడగట్టేందుకు ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు.

జిల్లా             మహిళలు     పురుషులు     మొత్తం

కరీంనగర్      2,11,066          2,07,771         4,18,837
పెద్దపల్లి        1,46,296          1,43,390        5,59,686
జగిత్యాల       1,06,636             99,841        2,06,477

రాజన్నసిరిసిల్ల    63,290    59,522    1,22,812