
పోలీస్ శాఖను అత్యున్నత స్థానంలో ఉంచాలన్నదే తెలంగాణ సర్కార్ లక్ష్యమన్నారు ఎంపీ కవిత. హైదరాబాద్ లక్డీ కపూల్ లో నూతనంగా నిర్మించిన వుమెన్ సేఫ్టీ వింగ్ భవన ప్రారంభోత్సవానికి హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి కవిత హాజరయ్యారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ , క్యాబ్స్, పోలీస్ స్టేషన్లు, భరోసా సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ మహిళలపై దాడులు ఆగకపోవడం దారుణమన్నారు. విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని హక్ ఐ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయిలో మంచి పేరుందన్నారు హోం మంత్రి మహామూద్ అలీ. గతంలో పోలీస్ స్టేషన్లు దారుణంగా ఉండేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పోలీస్ స్టేషన్లను ఆధునికీకరించామన్నారు.