పుల్వామా దాడికి రెండేళ్లు.. అమరుల త్యాగాలు మరువలేం

పుల్వామా దాడికి రెండేళ్లు.. అమరుల త్యాగాలు మరువలేం

న్యూఢిల్లీ: పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు కేంద్ర మంత్రులు రాజ్‌‌నాథ్ సింగ్, అమిత్ షా నివాళులు అర్పించారు. 2019లో జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సైనికులు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌‌పై ఉగ్ర దాడి జరిగిన సంగతి తెలిసిందే. పేలుడు పదార్థాలతో ఉన్న కారును నడుపుకుంటూ వచ్చిన ఉగ్రవాది, సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిలోని బస్సును ఢీకొట్టాడు.  ఈ ఘటనలో 40 మంది సీఆర్‌‌పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఈ ఘటనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా అమరుల సేవలను రాజ్‌‌నాథ్, షా గుర్తు చేసుకున్నారు.

దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లకు నివాళులు అంటూ రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. ‘జవాన్ల బలిదానాలను భారత్ ఎప్పటికీ మర్చిపోదు. వారి కుటుంబాలకు మేం ఎప్పటికీ అండగా ఉంటాం’ అని రాజ్‌‌నాథ్ చెప్పారు.

‘పుల్వామా అటాక్‌లో చనిపోయిన వీరులకు నా వందనాలు. సైనికుల త్యాగాలు, ధైర్యసాహసాలను భారత్ ఎప్పటికీ మర్చిపోదు’ అని షా ట్వీట్ చేశారు.