వర్క్ ఫ్రం హోమ్ కంటిన్యూ..

వర్క్ ఫ్రం హోమ్ కంటిన్యూ..

నెలాఖరు వరకు ఇదే పరిస్థితి అంటున్న ఐటీ కంపెనీలు

హైదరాబాద్, వెలుగు: సిటీలో పెరుగుతున్న కరోనా కేసులతో ఐటీ కంపెనీల్లో డైలమా కొనసాగుతోంది. ఈ నెల 1 నుంచి పూర్తిస్థాయిలో ఆఫీసులు ఓపెన్ చేస్తారని భావించినా, నెలాఖరుదాకా ఆ పరిస్థితి కనిపించడం లేదు. సిటీలో దాదాపు 6 లక్షల మంది టెకీలు ఉన్నారు. కరోనా ఎఫెక్ట్​ కారణంగా కంపెలన్నీ స్టాఫ్​తో వర్క్ ఫ్రం హోమ్​ చేయిస్తున్నాయి. ఎమర్జెన్సీ సర్వీసులకు మినహాయింపున్నా ఆఫీసులు ఓపెన్ చేయడం లేదు.

ట్రాన్స్​పోర్ట్​ ప్రాబ్లమ్
ఐటీ కంపెనీల్లో 40 శాతం స్టాఫ్​కు మాత్రమే వెహికల్ ఫెసిలిటీ కల్పిస్తున్నారు. 20శాతం మంది ఓన్ వెహికల్స్​లో, మిగిలిన వాళ్లు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా డ్యూటీకి వెళ్లేవారు. సిటీలో ఇంకా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్​ స్టార్ట్​ కాలేదు. అందరికీ ట్రాన్స్​ఫోర్ట్​ ఫెసిలిటీ కల్పించాలంటే కంపెనీకి భారమవుతుందని మాదాపూర్‌లోని ఓ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ ప్రసూన పేర్కొన్నారు. హైటెక్ సిటీలోని ఓ కంపెనీ ఈ నెల 1 నుంచి ఆఫీసుకు అటెండ్ కావాలని స్టాఫ్​కు గత నెల 25న ఇన్ఫర్మేష న్ ఇచ్చింది. తాజా కేసులను చూసి మరో 15 రోజులు వర్క్ ఫ్రం హోమ్​ పొడిగి స్తున్నట్లు ప్రాజెక్టు మేనేజర్ల ద్వారా మెసేజ్​ పంపించింది. ఇక ఎంఎన్‌సీలైతే ఇప్పట్లో ఆఫీసులకు రావాల్సిన పని లేదని, మరో నెలపాటు వర్క్ ఫ్రం హోమ్​నే ఉంటుందని నిర్ణయం తీసుకున్నాయి.

For More News..

ఉద్యోగ సంఘాల లీడర్ల చుట్టాలకు నజరానా!

మారటోరియంలో వడ్డీ వసూలు చేయకూడదు!