వర్కవుట్స్తో యాంగ్జైటీ దూరం

వర్కవుట్స్తో యాంగ్జైటీ దూరం

ఈ మధ్య ఎక్కువ మందికి ఉంటున్న మానసిక సమస్యల్లో యాంగ్జైటీ డిజార్డర్​ ఒకటి. వర్కవుట్స్​ చేస్తే ఈ డిజార్డర్​ నుంచి బయటపడొచ్చని ‘జర్నల్​ ఆఫ్​ అఫెక్టివ్​ డిజార్డర్’లో వచ్చిన ఒక  స్టడీ చెప్తోంది.  స్టడీ కోసం యాంగ్జైటీ డిజార్డర్​తో బాధపడుతున్న 286మందిని తీసుకున్నారు. వీళ్ల సగటు వయసు 39 ఏళ్లు. వీళ్లలో 70శాతం మంది ఆడవాళ్లు.  పార్టిసిపెంట్స్​ని రెండు గ్రూప్స్​ చేసి, 12 వారాలు ఎక్సర్​సైజ్​ చేయాలని చెప్పారు. ఒక గ్రూప్​ వాళ్లని లో–ఇంటెన్సిటీ ఎక్సర్​సైజ్​ చేయాలని, రెండో గ్రూప్​ వాళ్లని మీడియం లేదా హై– ఇంటెన్సిటీ ఎక్సర్​సైజ్​ చేయాలని చెప్పారు. ఎక్సర్​సైజ్​ చేస్తున్నప్పుడు వీళ్ల హార్ట్​బీట్​, బ్లడ్​ ప్రెజర్​, బాడీ టెంపరేచర్​ వంటివి చెక్​ చేశారు. వీళ్లలో దాదాపు సగం మంది పదేండ్లకు పైగా యాంగ్జైటీ సమస్యతో బాధపడుతున్నారని తెలిసింది.

స్ట్రెస్​ ఫ్యాక్టర్స్ లేకున్నా 
 టెన్షన్​గా, స్ట్రెస్​లో ఉన్నప్పుడు ఎలా రియాక్ట్​ అవుతారు? అనేదాని మీద  యాంగ్జైటీ ఆధారపడి ఉంటుంది. స్ట్రెస్​ కారకాలు లేకున్నా కూడా కొందరు స్ట్రెస్​లో ఉన్నట్టే ప్రవర్తిస్తారు. వీళ్లకు ఆలోచనల మీద కంట్రోల్​ ఉండదు. యాంగ్జైటీ కారణంగా డయాబెటిస్​, రెస్పిరేటరీ ఇష్యూస్​ వచ్చే ఛాన్స్​ ఉందంటున్నారు డాక్టర్లు. 

యాంగ్జైటీ డిజార్డర్ లక్షణాలు
టెన్షన్ పడడం​, రెస్ట్ లేకపోవడం, నెర్వస్​గా కనిపించడం, భయం వేయడం వంటివి యాంగ్జైటీ లక్షణాలు. కొందరికి ‘ఫ్లైయింగ్​ ఫోబియా’ ఉంటుంది. మరికొందరు నలుగురిలో కలవాలంటే ఇబ్బందిగా ఫీలవుతారు. రెగ్యులర్​గా ఎక్సర్​సైజ్​ చేయడం, పోషకాలున్న ఫుడ్ తినడం, కంటినిండా నిద్రపోవడం ద్వారా యాంగ్జైటీని తగ్గించుకోవచ్చు అంటున్నారు సైకాలజిస్టులు.  వర్కవుట్స్ చేస్తే ఫిజికల్​గా ఫిట్​ అవుతాం. అంతేకాదు యాంగ్జైటీ వంటి మెంటల్​ హెల్త్​ ఇష్యూస్​ కూడా తగ్గిపోతాయట. ఎక్సర్​సైజ్​ చేసినప్పుడు కండరాల కదలికల వల్ల, రక్తప్రసరణ పెరుగుతుంది. వర్కవుట్ చేయడం వల్ల ఇంకో బెనిఫిట్​ ఏమంటే.. మెదడులో ఫీల్​గుడ్​ హార్మోన్లు అయిన ఎండార్ఫిన్లు రిలీజ్​ అవుతాయి. ఇవి యాంగ్జైటీని తగ్గిస్తాయి అంటున్నారు క్లినికల్​ సైకాలజిస్టులు.